Tuesday, December 5, 2023

Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడ్రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్పపీడనం ప్ర‌భావంతో తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న అందింది. అక్క‌డే ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్న‌ట్టు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం వాయువ్యదిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే చాన్సెస్ ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ మూడు రోజులు అంటే 22వ తేదీ దాకా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -
   

ఇవ్వాల (సోమ‌వారం) వ‌రంగ‌ల్ స‌హా ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. సాయంత్రం హైద‌రాబాద్ సిటీలో అక్క‌డ‌క్క‌డ జ‌ల్లులు ప‌డ్డాయి. ఇక రేపు (మంగళవారం) ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్ధిపేట, సంగారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది.

గడిచిన 24 గంటల్లో 242 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల మండలం కాసిపేటలో 5.36, కుమ్రంభీం జిల్లా తిర్యాణిలో 3.64, నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 3.61 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు టీఎస్‌ టీపీఎస్‌ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement