Thursday, April 18, 2024

Bharath jodo-12: స్నేక్ బోటు రేసులో రాహుల్ గాంధీ.. ప‌డ‌వ ఎక్కి తెడ్డేసిన ఫొటోలు వైర‌ల్‌

భార‌త్ జోడో యాత్రతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా సుదీర్ఘ పాద‌యాత్ర‌కు తెర తీసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. త‌న యాత్ర‌లో ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. దారిలో త‌న‌ను క‌లిసేందుకు వ‌స్తున్న వివిధ వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకుంటున్న రాహుల్ ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారిస్తున్నారు. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర ప్ర‌స్తుతం కేర‌ళ రాష్ట్రంలో ఇవ్వాల (సోమ‌వారం) 12వ రోజు కొన‌సాగింది.

సోమ‌వారం నాటి యాత్ర‌లో భాగంగా కేర‌ళ‌లోని ఓ వాగులో జ‌రిగిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌డ‌వ సిబ్బంది. పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఉత్సాహంగా తెడ్డేశారు. తెడ్డేసిన నేప‌థ్యంలో కాస్తంత అల‌స‌ట వ‌చ్చిన‌ట్లు క‌నిపించిన రాహుల్.. త‌న కుడి చేతి భుజాన్ని ఎడ‌మ చేతితో రుద్దుకున్నారు. ఇలా ప‌డ‌వ ఎక్కి తెడ్డేసిన రాహుల్ గాంధీ వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement