Monday, April 29, 2024

Airline | హైదరాబాద్​ నుంచి రస్​ అల్​ఖైమాకు డైరెక్ట్​ ఫ్లైట్​

తక్కువ చార్జీలతో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండిగో ఎయిర్​లైన్స్​ మరో అద్భుత అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్​ నుంచి రాస్​ అల్​ ఖైమాకు డైరెక్ట్​ విమానాన్ని నడపనుంది. టూరిజం, బిజినెస్​ అంశాలను గమనంలోకి తీసుకుని ఈ సేవలను విస్తృతం చేయనున్నట్టు ఆ సంస్థ గ్లోబల్​ సేల్స్​ హెడ్​ వినయ్​ మల్హోత్రా తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇండిగో విమానయాన సంస్థ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్తోంది. తన అంతర్జాతీయ కార్యకలాపాలను బలోపేతం చేసే క్రమంలో భారతదేశంలో తక్కువ-ధర విమానయాన సంస్థగా పేరు గడించింది. ఇక.. జూన్ 15వ తేదీ నుండి హైదరాబాద్– రస్ అల్ ఖైమా మధ్య కొత్త రోజువారీ డైరెక్ట్ విమానాన్ని నడపనున్నట్టు ఇండిగో తెలిపింది. వేసవి షెడ్యూల్‌కు అదనంగా ఈ సరికొత్త జోడింపుతో టూరిస్టులు, బిజినెస్​ వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇండిగో అంచనా వేస్తోంది.

సెప్టెంబరు 2022లో ముంబయి నుండి రాస్ అల్ ఖైమాకు విమానయాన సంస్థ మొదటిసారిగా డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌కు కూడా డైరెక్ట్​ ఫ్లయిట్​ వేయడం వల్ల ఈ ప్రాంతంలో కూడా మరింతగా సేవలందించాలనే దాని నిబద్ధతను బలోపేతం చేసిందని సేల్స్​ హెడ్​ వినయ్​ తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త విమానాలను ప్రవేశపెట్టినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా చెప్పారు.

- Advertisement -

ఈ సంవత్సరం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలలో పెరుగుదలను చూస్తున్నామన్నారు. భారతదేశం యొక్క ప్రముఖ క్యారియర్‌గా తాము కొత్త మార్గాలను పరిచయం చేయడం ద్వారా.. తమ ప్రస్తుత మార్గాలకు ఫ్రీక్వెన్సీలను యాడ్​ చేస్తున్నామని, తద్వారా ఈ అవసరాన్ని నెరవేరుస్తున్నామని అన్నారు.  రాస్ అల్ ఖైమా మధ్యప్రాచ్యంలో 11వ గమ్యస్థానం కాగా, అంతర్జాతీయంగా 26వది అని,.ఇక..  ఇండిగో నెట్‌వర్క్‌లో 100వ స్థానంగా ఉందని వివరించారు.

కాగా, టూరిస్టులకు బీచ్‌లు,  హజార్ పర్వతాలతో పాటు ప్రకృతి వనరులను ఆస్వాదించే అవకాశం ఉంటుందని, అలాగే ప్రామాణికమైన ప్రదర్శనలను అనుభవించవచ్చని చెప్పారు. రస్ అల్ ఖైమాలోని కొన్ని పర్యాటక ప్రదేశాలు చాలా ఫేవరేట్​గా ఉంటాయని.. అందులో జెబెల్ జైస్, ధయాహ్ ఫోర్ట్, నేషనల్ మ్యూజియం, ఐన్ ఖట్​తో పాటు ఇతర ప్రదేశాలలో సూర్యాస్తమయం, జిప్‌లైన్ వంటి వాటిని ఎంజాయ్ చేయొచ్చన్నారు. ఇక.. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం వంటి మరెన్నో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఉన్నందున హైదరాబాద్ కూడా పర్యాటకులకు గొప్ప గమ్యస్థానంగా ఉంటుందని, అంతేకాకుండా ఇక్కడ ఫస్ట్-క్లాస్ వైద్య సేవలు ఉండడంతో ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement