Tuesday, May 7, 2024

Spl Story | ఏజ్​ని తగ్గించే కెమికల్‌ కాక్‌టెయిల్‌.. ఇకపై నిత్య యవ్వనమే!

హార్వార్డ్​ సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలు సక్సెస్​ అయితే ఇకమీదట మనుషుల్లో వృద్ధాప్యం (ఓల్డ్​ అనేది) అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎలుకలు, కోతులపై జరిపిన పరిశోధనల్లో కొంతమేరకు మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో వారు హ్యుమన్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ పరిశోధనలు ఫలిస్తే.. ‘‘వీడు ముసలోడే కావొద్దే’’ అన్న డైలాగులు నిజమవుతాయి. మానవులు నిత్య యవ్వనంగా ఉండొచ్చేమో!

ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మానవుల్లో వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి.. చర్మం ముడతులు పడడం, సత్తువ తగ్గడం, ఒళ్లు వంగిపోవడం వంటివి సహజంగా జరుగుతాయి. వయసుతోపాటు శరీరంలో వృద్ధాప్య (ఓల్డ్​ ఏజ్​) ఛాయలు కనిపిస్తాయి. అయితే.. ఏజ్​ పెరిగినా శరీరం నిత్య యవ్వనంలా కనిపించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ దిశగా హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కొంతమేర కీలక ముందడుగు పడింది. వయసును తగ్గించే కెమికల్‌ కాక్‌టెయిల్‌ను తాము డెవలప్​ చేశామని వారు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధ్యయన వివరాలు ఈ నెల 12వ తేదీన ఏజింగ్‌ జర్నల్‌లో ప్రచురించారు.

‘‘జీన్‌ థెరపీ ద్వారా వయస్సు తగ్గించొచ్చని మేము ఇంతకుముందే కనుగొన్నాం. లేటెస్ట్​గా కెమికల్‌ కాక్‌టెయిల్స్‌ ద్వారా కూడా వయస్సును తగ్గించవచ్చని గుర్తించాం. శరీరం పునరుజ్జీవింపజేసే దిశగా ఇది కీలక ముందడుగు’’ అని హార్వర్డ్‌ పరిశోధకుడు డేవిడ్‌ సిన్‌క్లయిర్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

- Advertisement -

అయితే.. ప్రతి కెమికల్‌ కాక్‌టెయిల్‌లోనూ ఐదు నుంచి ఏడు ఏజెంట్స్‌ ఉంటాయని, ఇవి ఇతర శారీరక, మానసిక రుగ్మతల చికిత్సకు వినియోగించేవే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కణాల వయసును తగ్గించి, వాటిని పునరుజ్జీంపజేసే మాలెక్యూల్స్ ను కనుగొనేందుకు తాము మూడేండ్లపాటు శ్రమించినట్టు పరిశోధకుడు డేవిడ్‌ చెప్పారు. మెదడు కణజాలం, కిడ్నీ, కండరాలపై చేసిన పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికైతే కోతులు, ఎలుకలపై ఈ అధ్యయనం చేశామని, ఇకమీదట మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఈ ట్రయల్స్‌ ఉండబోతున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement