Monday, May 6, 2024

పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 9కి వాయిదా

పెగాసస్ అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. పెగసస్​ నిఘా వ్యవహారంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. అయితే వాయిదాకు మందు కీలకమైన పన్ను చట్టాల సవరణ బిల్లు లోక్​సభలో ఆమోదం పొందింది.

కాగా, పెగాసస్​ నిఘా వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పెగాసస్ అంశంపై విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. పెగసస్​ సాఫ్ట్​వేర్​కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement