Saturday, April 27, 2024

ప్రభాస్ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ !!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో రెండు కీలక పాత్ర కోసం నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండ, న్యాచురల్ స్టార్ నాని ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇక ఈ సినిమా కోసం మిషన్ ఇంపాజిబుల్ ,అవెంజర్స్ వంటి చిత్రాలకు వాడిన అలెక్సా కెమెరా ని ఉపయోగించనున్నారట. సుమారు 100 రోజుల పాటు కెమెరా రెంట్ కు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లోనే త్వరలోనే జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement