Monday, April 29, 2024

డ్ర‌గ్స్ వినియోగ‌దారుల జాబితాని సేక‌రిస్తున్నాం – సీపీ సీవీ ఆనంద్

డ్ర‌గ్స్ వినియోగిస్తున్న వారి జాబితాని సేక‌రిస్తున్నామ‌ని హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకి వెల్ల‌డించారు. ఏజెంట్ల‌ని నియ‌మించుకుని ప‌లువురు ప‌లు రాష్ట్రాల‌కు డ్ర‌గ్స్ ని స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని చెప్పారు. డికోయ్ ఆపరేషన్ చేసి స‌ర‌ఫ‌రాదారుల‌ను హైద‌రాబాద్ కి ర‌ప్పించామ‌న్నారు. ముంబైకి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు పంజాగుట్ట‌లోని ఓ హోట‌ల్ లో బ‌స చేయ‌గా దాడి చేసి ప‌ట్టుకున్నామ‌ని వివ‌రించారు. కాగా వారి వ‌ద్ద నుంచి 99 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 17 ఎల్ఎస్డీఈ, 27 ఎక్స్ టసీ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు టోనీ డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు చెప్పారు.

కాగా చాదర్ ఘాట్ కు చెందిన కైసర్ ముంబయి ముఠాతో చేతులు కలిపి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు చెప్పారు. తిరుమలగిరి పోలీసులు కూడా ఇద్దరు సభ్యులు ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మత్తుపదార్థాల టాబ్లెట్ ల‌ని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. డ్రగ్స్ బాధితుల విషయంలో ఇన్ని రోజులు మానవీయ కోణంలో ఆలోచించామని వెల్లడించారు. అవసరమైతే వాళ్లను చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. డ్రగ్స్ డిమాండ్ ను తగ్గిస్తే సరఫరాకి అడ్డుక‌ట్ట వేయొచ్చ‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement