Friday, October 11, 2024

సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తెలంగాణను నంబర్ 1గా నిలుపుదాం : ప‌రిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌..

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారులు చొరవతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని, తద్వారా రాష్ట్రంలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదని, తమ తమ శాఖలలోని అన్ని విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్రస్థానం దక్కడం ఖాయమని, ఈ దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన బుధవారంనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల ప్రక్రియపై ఉన్నతస్థాయి పమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషితో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈసారి అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100శాతం సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ ఏడాది ర్యాంకులను నిర్దేశించే యూజర్‌ ఫీడ్‌ బ్యాక్‌ అత్యంత కీలకమైన అంశమని, ఈ విషయంలో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారులు చొరవతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని, తద్వారా రాష్ట్రంలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దక్కించుకునేందుకు ఎంతో దోహదకారిగా నిలిచిందని, ఈసారి సైతం అగ్రస్థానం సాధించుకునేందుకు మనమంతా సమిష్టిగా ప్రయత్నిద్దామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా శాఖల వారీగా మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల, విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement