Tuesday, April 30, 2024

స్పుత్నిక్ వి వ్యాక్సిన్.. ఏడాదికి ఎన్ని కోట్లో తెలుసా?

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి స్పుత్నిక్ వి రూపంలో మ‌రో వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్​ వి అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించింది. టీకాకు అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది.  ఇప్పటికే దేశంలో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ వ్యాక్సిన్​లు అందుబాటులో ఉండగా.. స్పుత్నిక్​ మూడో టీకా కానుంది. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పుత్నిక్​ వి టీకాను ఇప్పటికే అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ టీకాపై మనదేశంలో డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ క్లినికల్​ పరీక్షలు నిర్వహించింది. భారత్​లో సంవత్సరానికి 85 కోట్లకుపైగా టీకా డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతులకు డాక్టర్​ రెడ్డీస్​ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన 24 గంటల్లోపే డీసీజీఐ ‘స్పుత్నిక్-వి’ టీకా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.

స్పుత్నిక్ వి టీకా సామర్థ్యం 91.6 శాతంగా ఉంది. స్పుత్నిక్​ వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ (ఆర్​డీఐఎఫ్​) పేర్కొంది. తొలి విడత డోసులను ఏప్రిల్ నెలాఖరున లేదా మేలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement