Saturday, May 4, 2024

దిశ ఎన్ కౌంట‌ర్ లాగే – ‘బికీ అలీ’ ఎన్ కౌంట‌ర్

సామూహిక లైంగిక దాడి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒక‌రైన బికీ అలీ త‌మ క‌స్ట‌డీ నుంచి పారిపోయేందుకు య‌త్నించాడ‌ని.. పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నం చేయడంతో అలీ తమపై దాడి చేసినట్లు గువాహటి పోలీసులు వెల్లడించారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ అలీ వినకపోవడంతో ఆత్మరక్షణకోసం అతడిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. నిందితుడు దాడిలో ఇద్దరు మహిళా పోలీసులు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బికీ అలీ తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్ లోని ఓహోటల్ లో ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం తర్వాత వారంతా పారిపోయారని తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పాన్ బజార్ మహిళ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు బికీ గురించి సమాచారం తెలియడంతో అతడిని మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అసోంలోని Guwahatiలో ఈ సంఘ‌ట‌న‌ చోటుచేసుకుందని ఓ వార్తా సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అసోం పోలీసులు మంగళవారం రాత్రి ఎన్కౌంటర్ చేశారని వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement