Friday, May 10, 2024

‘అంటే సుంద‌రానికి’ చిత్రం నుండి అప్ డేట్

రేపు ..అంటే సుంద‌రానికి చిత్రం నుండి హీరోయిన్ న‌జ్రియా ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌నుంది. మేకర్స్ ఈ మేరకు ‘ఇంట్రడ్యూసింగ్ లీలా థామస్’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘హాలో.. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ ప్రేమకు, అభ్యర్థనలకు కట్టుబడి, మేము మా హీరోయిన్ నజ్రియాఫహద్‌ను లీలా థామస్‌గా మార్చి 17న సాయంత్రం 4:05 గంటలకు పరిచయం చేయనున్నాం’ అంటూ పేర్కొన్నారు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికీ’లో నాని సుందర్ అనే పాత్ర పోషిస్తున్నారు. కాగా హీరోయిన్ నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నజ్రియా ఇంట్రడ్యూసింగ్ ఎలా ఉండబోతుందోనంటూ ఎగ్సైట్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement