Thursday, May 16, 2024

Big Story: ఎహె, గిట్లైతే చానా కష్టం.. నాన్ స్టాప్ పార్టీలు చేసుకుందాం మచ్చా: ప్లేబాయ్ బేనాన్

కొవిడ్ మహమ్మారి చాలామంది జీవితాలను ఆగం చేసింది.. అయితే సంపన్న వర్గాలకు చెందిన వారు మాత్రం తమ లగ్జరీ లైఫ్ కోల్పోతున్నామని తెగ ఫీలవుతున్నారు. పార్టీల్లేవు.. పబ్బుల్లేవని ఆందోళన చెందుతున్నారు. అట్లాంటి కోవలోనిదే ఈ వార్త. ఆస్ట్రేలియాలో మిలియనీర్ అయిన ట్రావర్స్ బేనాన్ ఇప్పుడు తనకు ఇష్టమైన నాన్ స్టాప్ పార్టీలను మిస్ అవుతున్నట్టు తెలిపాడు. “క్యాండీ షాప్ మాన్షన్”లో లెజెండరీ పార్టీలకు ఫేమస్ అయిన ఆసీస్ మిలియనీర్ ఇతను..  సాధారణంగా 30మంది మహిళలు, అతని భార్యతో – రోజూ పార్టీలు చేసుకుంటాడు. కరోనా కారణంగా ప్లేబాయ్ బేనాన్ నాన్ స్టాప్ పార్టీలకు బ్రేక్ వచ్చింది. దీంతో అతను అసహనంగా ఉంటున్నాడు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆస్ట్రేలియాలో ఆంక్షలు కఠినతరం చేశారు. దీంతో తన పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఇది ప్లేబాయ్ ట్రావర్స్ బేనాన్ యొక్క నాన్-స్టాప్ పార్టీల జీవనశైలిని తీవ్రంగా దెబ్బతీసింది. కానీ, ‘‘ఇలా ఎక్కువ కాలం ఉండలేను.. త్వరలోనే వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టి నాన్ స్టాప్ పార్టీస్ చేసుకోవాలే’’.. అని చెబుతున్నాడు ట్రావర్స్ బెనాన్.

ముద్దుగుమ్మలతో పార్టీకి వెళ్తున్న ఆస్ట్రేలియా బిజినెస్ మన్ ప్లేబాయ్ ట్రాబెవర్స్ బేనాన్..

అందరిలాగే ఈ 49 ఏళ్ల పొగాకు వ్యాపారవేత్త కరోనా కారణంగా తన బిజినెస్ కి బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అతను రెండు సంవత్సరాలుగా తన సమయాన్ని ఎలా గడుపుతున్నాడో వివరించాడు. భార్య, నలుగురు పిల్లలతో నివసిస్తున్న అతను 15 -బెడ్‌రూమ్ లు, 19- బాత్‌రూమ్ లున్న అత్యంత లగ్జరీగా ఉండే “ఫ్యామిలీ హోమ్” నుండి మాట్లాడుతూ.. “కొవిడ్ ఆంక్షలు ఆస్ట్రేలియాలో చాలా ఇబ్బందికరంగా మారాయి. అయినా నేను చాలా ప్రాజెక్టులను రీ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా.. అయితే ఎన్ని బిజినెస్ లున్నా ముందు ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇస్తా.. ఇక దాని తర్వాత పార్టీలు ఉంటాయి.. ఇప్పుడంతా- తుపాను ముందు ప్రశాంతతగా పరిగణించాలే..” అని ఈ ప్లే బాయ్ చెప్పుకొచ్చాడు.

కాగా, బెనాన్ గోల్డ్ కోస్ట్ లోని సౌత్‌పోర్ట్ షార్క్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఫుట్‌బాల్ ఆటగాడిగా ఉండేవాడు. అతను 1989 ప్రీ-సీజన్ కోసం నార్త్ మెల్బోర్న్ కంగారూస్‌కు బదిలీ అయ్యాడు. అయితే గాయం తర్వాత అతను రిటైర్ మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా లెవి జీన్స్, మోస్చినో, వాలెంటినో, పాల్ స్మిత్ , కాల్విన్ క్లైన్‌లకు ప్లే బాయ్ బేనాస్ మోడల్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement