Friday, May 3, 2024

తిరుమలలో 13 నుంచి వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల, ప్రభ న్యూస్‌ : జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, తిరుపతిలో ఐదు ప్రాంతాల్లో కంటర్లు ఏర్పాటు చేసిన రోజుకు 5వేల చొప్పున 50 వేల టికెట్లను కేటాయిస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక భక్తులకు మాత్రమే టికెట్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వైంకుథ ద్వార దర్శనం కోసం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు కోవిడ్‌ లక్షణాలు ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. తిరుమలలో బస చేసేందుకు 7500 పైగా గదులు ఉంటే ప్రస్తుతం 1300లకు పైగా గదులు పునదుర్ధరణ జరుగుతోంది. భక్తులకు వీలైనంతవరకు తిరుపతిలోనే గదులు పొందడాని ప్రయత్నించాలి. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల, తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శానిటైజేషన్‌ జరుగుతుంది. భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటీవ్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలి. భక్తులు తప్పనిసరిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement