Friday, April 26, 2024

‘కుంభమేళా భక్తులు.. కరోనాను ప్రసాదంలా పంచిపెడతారు’!

హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాపై ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చే భక్తులంతా కరోనాను ‘ప్రసాదం’లా పంచిపెడతారని ఆమె వ్యాఖ్యానించారు.  కుంభమేళా నుంచి వచ్చిన భక్తులు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె సూచించారు. కుంభమేళా నుంచి ముంబైకి వచ్చిన భక్తులను గుర్తించి క్వారంటైన్‌కి తరలిస్తున్నట్లు మేయర్ కిషోరి తెలిపారు. ముంబై నగరంలో 95 శాతం మంది కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నారని.. మిగిలిన 5 శాతం మందితోనే సమస్యలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించడమే మేలని కిషోరి అభిప్రాయపడ్డారు.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్ తో మహారాష్ట్ర వణికిపోతోంది. రోజుకి 60 వేలకి పైగా కేసులు నమోదవుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రులకు రోగులు క్యూలు కడుతుండడంతో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఓ వైపు కరోనా వ్యాక్సిన్లు కొరత వేధిస్తుంటే… మరోవైపు మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో హరిద్వార్ కుంభమేళా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement