Sunday, April 28, 2024

కాఫీ విత్ క‌ర‌ణ్ షో కి స్వ‌స్తి – క‌ర‌ణ్ జోహార్

ఇక‌పై కాఫీ విత్ క‌ర‌ణ్ షో ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్. ఈ షో లో కరణ్ అడిగిన ప్రతి ప్రశ్న ఒక బాంబ్ లా ఉంటుంది. బోల్డ్ ప్రశ్నలు.. బోల్డ్ సమాధానాలు, విమర్శలు, ప్రశంసలు అన్నింటికి ఈ ఒక్క షో నే కేరాఫ్ అడ్రెస్స్. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది అనుకొనేలోపు కరణ్ జోహార్ బాంబ్ పేల్చారు. ఇక నుంచి ‘కాఫీ విత్ కరణ్’ఉండబోదని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. హలో, ‘కాఫీ విత్ కరణ్’ నా జీవితంలోనే కాదు మీ జీవితంలోనూ ఒక భాగమయ్యింది. పాప్ కల్చర్ చరిత్రలో మేం ప్రభావం చూపామని, అందులో మా స్థానాన్ని కనుగున్నామని నేను అనుకుంటున్నాను. కాబట్టి, ‘కాఫీ విత్ కరణ్’ మళ్లీ తిరిగి రాదని నేను చాలా హృదయపూర్వకంగా ప్రకటిస్తున్నాను- కరణ్ జోహార్ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బాలీవుడ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. సీజన్ 7 కోసం ఎదురుచూస్తున్నామని, ఇలాంటి షాకింగ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు.

https://twitter.com/karanjohar/status/1521723870494871553
Advertisement

తాజా వార్తలు

Advertisement