Tuesday, May 7, 2024

రూ.200కోట్ల‌కి – ప‌ఠాన్ డిజిట‌ల్ హ‌క్కులు కొనుగోలు చేసిన అమెజాన్

ప‌ఠాన్ చిత్రం డిజిట‌ల్ హ‌క్కుల‌ని రూ.200కోట్ల‌కి అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింద‌ట‌. ఈ చిత్రంలో స్టార్ హీరో షారుక్ ఖాన్ న‌టించాడు..సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాబోతున్న షారుఖ్‌ చిత్రంగా ‘పఠాన్‌’ అభిమానుల్లో అంచనాల్ని పెంచుతోంది. వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు సంబంధించిన వార్తొకటి బాలీవుడ్‌ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ 200కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ వార్తల్ని ఖండించలేదు. దాంతో డీల్‌ కుదిరిందని ముంబయి ట్రేడ్‌ వర్గాలంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement