Saturday, May 4, 2024

కెటిల్ బోరో అంపైర్ గా లేడు… టీమిండియాకు సెమీస్ గండం తప్పినట్టే..!

టీమిండియాకు ఐరన్ లెగ్ అంపైర్, అచ్చిరాని అంపైర్ గా ముద్రపడ్డ రిచర్డ్ కెటిల్ బోరో ఇంగ్లండ్ తో మ్యాచ్ కు ఐసీసీ ప్రకటించిన అఫీషియల్స్ జాబితాలో లేకపోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బ్రతికిపోయాం రా బాబు.. ఇక, టీమిండియా ఫైనల్ కు చేరడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కెటిల్ బోరో అంపైర్ గా లేడు కాబట్టి.. టీమిండియాకు సెమీస్ గండం దాటినట్టే, ఇంగ్లండ్ పై గెలుపు మనదే, ఫైనల్ కు ఎవరు వచ్చినా టీమిండియా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి పరోక్ష కారణమైన కెటిల్ బోరో లేడు.. కాబట్టి రోహిత్ సేన విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు.

టీ 20 వరల్డ్ కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్ లకు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ విడుదల చేసింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య నవంబర్ 9న జరిగే తొలి సెమీఫైనల్ కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా మరయిస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్ బోరో, మైఖేల్ గాప్ లు థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా ప్రకటించబడ్డారు. ఈ మ్యాచ్ కు రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నాడు. ఇక, నవంబర్ 10న అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. కుమార ధర్మసేన, పాల్ రిఫిల్ ఫీల్డ్ అంపైర్లుగా.. క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.

కాగా, 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో రిచర్డ్ కెటిల్ బోరో అంపైర్ గా వ్యవహరించిన (భారత్ ఆడిన మ్యాచ్ లు) ప్రతి నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. కెటిల్ బోరో ఫీల్డ్ అంపైర్ గా లేదా థర్డ్ అంపైర్ గా వ్యవహరించిన.. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో కెటిల్ బోరోపై భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఈ మ్యాచ్ లకు అంపైర్ గా రిచర్డ్ కెటిల్ బోరో లేకపోవడంతో టీమిండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement