Friday, May 17, 2024

స్వయం శిక్షణతో ఆత్మానందాన్వేషణ

క్రమశిక్షణ లోపించినపుడు ఆనందం దూరమవుతుంది. మనిషి జన్మించినది మొదలు ఆనందం కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అయితే అజ్ఞానంతో కూడి న అన్వేషణ దు:ఖానికి దారితీస్తుంది ఎందుకంటే సుఖమే ఆనందం అని భ్రమ పడ డం. సత్యాన్ని తెలుసుకోవడం అంత సులభమయిన విషయంకాదు. దానికి ఎంతో సా ధన, క్రమశిక్షణ అవసరం. ప్రకృతిని పరిశీలిస్తే శ్రమశిక్షణ ఏమిటో తెలుస్తుంది. సూ ర్యోదయం, చంద్రోదయం, ఉదయం, అస్తమయం, ఋతువులు, జీవుల ప్రత్యుత్పత్తి మొదలయినవి ఒక నిర్ణీత కాల వ్యవధులలో జరగడం మనం చూడవచ్చు. ఖచ్చి తమైన సమయములలో జరిగే ఖగోళ విన్యాసాలు ఆ భగవంతుని శక్తియుతమైన క్రమ శిక్షణను విశదపరుస్తుంది. ఎవరైతే ఈ ప్రకృతి రహస్యాన్ని అవగాహన చేసుకుంటారో వారు క్రమశిక్షణాయుత జీవనానికి అర్హత పొందినట్లు.
పశువులు, పక్షులు, వృక్షాలు, కీటకాలు ఖచ్చితంగా శ్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క ఆలోచనా శక్తి ఆ సృష్టికర్త యొక్క దృక్కులలో ఉంటుంది. ఒక రకంగా అవి చాలా ఆనందాన్ని పొందుతాయి. కారణం వాటికి దు:ఖం తెలియ దు. కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞాన సముపార్జనా శక్తిని కలిగిన మా నవుడు అ#హంకారంతో అజ్ఞానంలో కూరుకుపోవడం ఒక మాయ. ఆలోచన, వాక్కు, ప్రతిస్పందన మొదలయిన భగవంతుని వరాలను తన తమోగుణంతో శాపాలుగా మార్చుకుంటున్నాడు. అన్ని జన్మలలో మానవ జన్మ దుర్లభం. ఆ పరాత్పరుడు ఒక్క సారి ఆ అవకాశాన్ని కలిగిస్తాడు. దీనిని దుర్వినియోగం చేసుకోవడానికి ప్రధాన కార ణం క్రమశిక్షణ లోపించడం. ఈ జీవన ప్రహశికలో ఆనందంతో సేవించి ముక్తితో ము గించమని సూచిస్తున్నాడు. స్వయం శిక్షణతో సత్యాన్ని తెలుసుకుని ఆత్మానందాన్ని పొందమని నిర్దేసిస్తున్నాడు. కాని కాలమనే భగవంతుని శక్తిని ఒక ప్రణాళిక లేకుండా వృధా చేసుకొని సత్యమనే ఆనందానికి దూరమవుతున్నాడు. స్వధర్మానికి దూరమ యి దు:ఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ప్రారబ్ద కర్మలను బట్టి జన్మలను పొందు తున్న జేవుడు తన పూర్వీకుల నుండి పొందవలసిన స్వధర్మ రహస్యాలకు దూరమ వుతున్నాడు. అహంకారం, అజ్ఞానంలో రజో, తమోగుణ మాయలో పడి ప్రకృతికి విరుద్ధమయిన పరధర్మ చేష్టలతో పతనమవుతున్నాడు. సచ్చిదానందానికి దూరమవుతున్నాడు.
కాల నియమాన్ని పాటించినవాడు సత్యాన్వేషణలో సఫలమవుతాడు. బ్రహ్మ మూహూర్తంలో లేవడం, తరతరాల నుండి అందిన దైవ చింతన చేయడం, నీ పరిస రాలను జీవకారుణ్యమతం చేయడం, లభించిన పాంచ భౌతిక దేహాన్ని సత్యమయం చేసుకోవడం మొదలయినవి. మానవ జన్మకు తగిన శిక్షణలు. ఇవి క్రమ పద్ధతిలో కాలానుగుణంగా ఉంటాయి కాబట్టి ఇది క్రమశిక్షణ అయింది.
బాల్య, కౌమార, ¸°వ్వన, ప్రౌఢ, వృద్ధాప్య వ్యవస్థలలో కాలానుగుణంగా ప్రవ ర్తించడమే క్రమశిక్షణ. బాల్యంలో తల్లి, తండ్రి, గురువు, పెద్దల మాటలను పాటిం చాలి. కౌమారంలో తనకు లభించిన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. యవ్వ నంలో స్వధర్మాన్ని పాటిస్తూ సనాతన వాఙ్మయమును ఆధారం చేసుకుని సమాజానికి ఉపయోగపడాలి. తన కుటుంబానికి మంచి పేరు తేవాలి. ప్రౌఢ వయసులో ఇతరు లకు ఆదర్శంగా నిలవాలి. వృద్ధాప్యంలో వైరాగ్యాన్ని అందుకొని పూజనీయులవ్వాలి. దివ్యజీవిగా నిష్క్రమించాలి. ఈ భూమి మీద సజీవుడుగా నిలిచిపోవాలి.

క్రమం తప్పని ఈ విశ్వ విన్యాసాన్ని అవగాహన చేసుకొని తదనుగుణంగా మాన వ జన్మను సార్థకం చేసుకోవాలి. అప్పడే ఆనందాన్ని అనుభవిస్తాడు. లేదా ఆనందం అనే భ్రమలో దు:ఖాన్ని భరిస్తాడు. రాజు నుండి పేద వరకూ ఈ క్రమశిక్షణను కలి గియుండాలి. ఇది లోపిస్తే సృష్టికి కంటకులుగా మారడం ఖాయం. చివరకు భయంక రంగా అంతమవడం సహజం.
మానవుడు తప్ప మిగిలిన జీవులన్నీ ప్రకృతి శాసనాన్ని అనుసరిస్తూ భగవం తుని ఆజ్ఞకు లోబడి ఆనందంగా తమ కాల అవధిని ముగిస్తున్నాయి. మానవుడు మా త్రం అహంకారంతో ప్రకృతి శాసనాలను ఉల్లంఘించడం అవివేకం. ఎవరైతే రాగద్వే షాలకు అతీతంగా భగవంతుని తెలుసుకొని ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాడో వానిని ఆ భగవంతుడనే శక్తి గుర్తిస్తాడు. ఆ జీవిని నేరుగా తన ధామానికి చేర్చుకుంటాడు. జీవులకు ఉపకారం చేయడమే ధర్మము. కారుణ్యమే ఆనందం. అపకారం చేస్తూ ప్ర కృతిని విధ్వంసం చేసేవారిని ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడనే శక్తి రూపుమా పుతాడు. సకాలంలో చేస్తే చింతన ధర్మాన్ని ఎలా అనుసరించాలో నేర్పుతుంది. ఏది మంచో, ఏది చెడో ఖచ్చితంగా తెలియచేస్తుంది. దానికి కాలానుగుణంగా క్రమశిక్షణ. తో నడుచుకుంటే చాలు. తల్లి, తండ్రి, గురువు, భగవంతుడు, శక్తి. ఇవన్నీ నీ అంతరా త్మతో పరికిస్తే ఈ ప్రకృతిలో లభించే ధర్మ ప్రబోధకులేనన్న విషయం అవగతమవు తుంది.
కుర్వన్నేవే#హ కర్మాణి జిజీవిషే చ్ఛతగ్‌ం సమా:
ఏవం త్వయి నాన్యథే తోస్తి న కర్మలిప్యతే నరే
మానవుడు ప్రకృతి శాసనాలను భగవంతునిగా భావించి క్రమశిక్షణతో కర్మలు చేస్తూ సంపూర్ణంగా జీవించాలని కోరుకోవాలి. అటువంటి కర్మలు మానవుని కర్మశా సనానికి బంధించదు. అప్పడే తాను ఆనందం అనుభవిస్తూ ఇతరులకు పంచుతాడని, ఇంతకంటే వేరే మార్గం లేదని ఈశోపనిషత్‌ తెలియచేస్తోంది. మోహానికి కారణమైన ఈ దేహ చింతనను వదలి వేసి నిత్యసత్యమైన ఆత్మానంద అన్వేషకుడే అసలైన ఆనంద యోగి. ఆ యోగి కూడా మనిషే!

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు, 8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement