Sunday, May 5, 2024

మూడు పార్టులుగా బ్ర‌హ్మాస్త్ర‌- వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన మేక‌ర్స్

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ్ బీర్ క‌పూర్..ఆలియాభ‌ట్ లు జంట‌గా న‌టించిన చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. బ్ర‌హ్మాస్త్ర‌ మూడు పార్టులుగా రాబోతుంది. ఫ‌స్ట్ పార్టు సెప్టెంబ‌ర్ 9న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.ఈ చిత్రాన్ని అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బిఅమితాబ్ బ‌చ్చ‌న్ ,అక్కినేని నాగార్జున , మౌనీరాయ్ కీ రోల్స్ చేస్తున్నారు. కాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ను సాంగ్ రూపంలో అందించారు. కేస‌రియా థేరా వీడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు.ఈ మెలోడీ ట్రాక్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది. ర‌ణ్‌బీర్‌క‌పూర్ -అలియా ల‌వ్ ట్రాక్‌తో సాగే ఈ పాట సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలువ‌డం ఖాయ‌మ‌ని తాజా వీడియో ట్రాక్ చెబుతోంది. పాన్ ఇండియా క‌థాంశంతో వ‌స్తున్న ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, త‌మిళం, బెంగాలీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement