Friday, April 26, 2024

వ‌చ్చే మూడు వారాల్లో భారీ కేసులు – ఆరోగ్య‌శాఖమంత్రి వీణాజార్జ్

కేర‌ళ రాష్ట్రంలో వ‌చ్చే మూడు వారాల్లో భారీగా క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేర‌ళ‌లో ప్ర‌స్తుతం 78కోవిడ్ క్ల‌స్ట‌ర్లు ఉన్నాయ‌న్నారు. కాగా డెల్టా, ఒమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. మ‌రో రెండు, మూడు వారాల్లో మ‌రిన్ని కేసులు పెర‌గ‌వ‌చ్చ‌ని చెప్పారు. కేర‌ళ రాష్ట్రంలోని అధికార సీపీఐ(ఎం) తో సహా మిగిలిన రాజకీయ పార్టీలు కోవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆరోగ్య శాఖ చూస్తోంద‌ని తెలిపారు. ఇటీవల సీపీఐ(ఎం) జిల్లా సమావేశంలో భాగంగా తిరువాతిర నృత్య ప్రదర్శన నిర్వ‌హించారు. దీనిపై పెద్ద రాజ‌కీయ వివాదం చ‌ల‌రేగింది. అధికార పార్టీ నాయ‌కులు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ఆ కార్యక్ర‌మం ఏర్పాటు చేసిన వారిపై కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసులు న‌మోదు చేయాల‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ నేప‌థ్యంలోనే మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు.కేర‌ళ‌లో 15-18 ఏళ్ల మధ్య వయసున్న టీనేజ‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 51 శాతం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించామ‌ని ఆరోగ్య‌మంత్రి వీణా జార్జ్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 7,66,741 మంది పిల్లలు వ్యాక్సిన్ పొందార‌ని ఆమె అన్నారు. ఇందులో త్రిసూర్ జిల్లాలో అత్యధికంగా 97,458 మంది పిల్లలకు ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశార‌ని ప్ర‌క‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement