Wednesday, April 17, 2024

అన్నదాతలకు వరం రైతుబంధు.. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు ఒక వరం లాంటిదని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు.రైతులు ఆర్థికాభివృద్ధి పొందినప్పుడే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగుంటాయని దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందనారు, రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు, రాష్ట్రంలో రైతుబంధు పేరిట రైతుల ఖాతాల్లో 55 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు. కునారం గ్రామం లో1157 మంది రైతులకు సుమారు రూ 10 కోట్ల రూపాయలను ఇప్పటివరకు రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు.

రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెడుతు వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న చర్యలు ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు రైతులు పట్టించుకున్న దాఖలాలు లేవనీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతులను రాజుల చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా, రైతుబంధు, 24 గంటల విద్యుత్‌,రైతువేదికల నిర్మాణం,సబ్సిడీ ఎరువులు, పనిముట్లు,విత్తనాలు, అదేవిధంగా ఆసరా పింఛన్, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి తదితర అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. అనంతరం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం గ్రామంలో అకాల వర్షానికి నేల పాలైన పంటలను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement