Sunday, May 19, 2024

KCR Target – ప‌ది ప‌థ‌కాలు …వంద సీట్లు..

రైతుబంధు, దళితబంధు, వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌, మిషన్‌ భగీరథ, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు, ఆసరా పింఛను, కంటి వెలుగు, కాళేశ్వరం.. ఈ పది పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చింది. ముచ్చటగా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ విజయం నల్లేరుమీద నడకే అని ఇప్పటివరకు నిర్వహించిన అనేక సర్వేలు వెల్లడించాయి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :

అనేక ఉద్యమాలు, ప్రాణ త్యాగాల అనంతరం ఏర్పడిన తెలంగాణాలో ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలు ఏం కోరుకుంటున్నారన్న అంశంపై అధ్యయనం చేసిన ఉద్యమ నేత కేసీఆర్‌ తనదైన శైలిలో సంక్షేమ పథకాలు ప్రారంభించి రెండు పర్యాయాలు ఎదురులేని నేతగా నిలిచారు. ఇక మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సీఎంగా నిలువాలన్న లక్ష్యంతో, పక్కా ప్రణాళికలో ఆయన ముందుకు సాగుతున్నారు. తెలంగాణాలో సాధించిన అభివృద్ధే అజెండాగా బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా విస్తరిస్తూనే, స్వరాష్ట్ర ప్రజలకు మరేదో చేసి చూపాలన్న తపనతో అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రణాళికను రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా జీవన స్థితిగతులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న ఆయన ఎప్పటికప్పుడు తన ఆలోచనా విధానాలకు పదును పెడుతూ సక్సెస్‌ అవుతున్నారు.

ఈ సారి కూడా అవే ఆలోచనలతో ఎన్నికలకు వెళ్తున్నారు. గడిచిన రెండెళ్ళలో దాదాపు అరడజను పర్యాయాలు నియోజకవర్గాల వారిగా సర్వేలు నిర్వహించి ప్రజల ఆకాంక్షలను, నాయకులు స్థితిగతులను పక్కాడా అంచనా వేసిన కేసీఆర్‌ ఈ ఏడాది ఆఖరులో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘పది పథకాలు.. వంద అసెంబ్లిd స్థానాలు’ అన్న అజెండాతో ప్రజల్లోకి వెళ్ళేందుకు సంసిద్ధమవుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్ల ప్రస్తానం అంతా పేద ప్రజల చుట్టే తిరుగుతోంది. ఆయన ప్రవేశ పెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు బోలెడన్ని ఉన్నా.. పది పథకాలు మాత్రం చారిత్రాత్మకంగా నిలిచాయి. ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య దాదాపు కోటి 20 లక్షల వరకు ఉంటుంది. ఎవరు అవునన్నా, కాదన్నా.. ఇప్పటివరకు ఎవరూ అందించలేని చేయూత ఇస్తున్న కేసీఆర్‌కే జైకొట్టాలన్న ధోరణితో మెజారిటీ వర్గాలు బీఆర్‌ఎస్‌కే మద్ధతుగా నిలుస్తారని ఆ పార్టీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రం సర్కారు కూడా కేసీఆర్‌ పథకాలనే కాపీ కొడుతున్న సందర్భాలు అందుకు మద్ధతుగా నిలుస్తున్నాయి. అదిచాలు సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అని చెప్పడానికి.. అంటూ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ సర్కారు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఉన్న లోటుపాట్లును వెతికి రాజకీయంగా దెబ్బ తీయాలన్న విపక్ష పార్టీల ప్రయత్నాలు ఎప్పటికప్పుడు వారికి బెడిసి కొడుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌, భాజపాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ‘దళిత బంధు’, ‘ధరణి’, ‘ఉచిత విద్యుత్‌’ అంశాలపై రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న ఆ పార్టీ అగ్రనేతల అజెండా కలిసిరావడం లేదు.

ప్రజలకు దగ్గరయ్యేందుకు మరిన్ని యత్నాలు
సరికొత్త సంక్షేమ పథకాలతో పవర్‌లోకి రావాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు అమలవుతున్న వెల్ఫేర్‌ స్కీమ్‌లకు కొన్ని మార్పులు చేయడంతో పాటు- బలమైన హామీని ఇచ్చి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏ స్కీమ్‌తో ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందో ఇం-టె-లిజెన్స్‌ వర్గాలు ఇప్పటికే ఆరా తీసే పని మొదలుపెట్టాయి. ఆ వర్గాల నుంచి స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాత వీటిపై బీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సరైన సమయంలో జనాకర్షక పథకాలు ప్రకటించి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను గుక్క తిప్పుకోకుండా చేయాలన్నదే కేసీఆర్‌ వ్యూహం. ఈసారి ఆ రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో చావో.. రేవో.. తేల్చుకుందామన్న పట్టుదలతో ఉండడంతో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ముక్కోణపు పోటీ- అనివార్యం కావడంతో ఓట్ల చీలికను నివారించడంపైనే ఫోకస్‌ పెట్టింది.

- Advertisement -

జనాకర్షక మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు
రైతుబంధు, దళితబంధు స్కీమ్‌లతో ఆ సెక్షన్‌ ఓటర్లకు దగ్గరయ్యామనే భావన ఉన్నప్పటికీ ఈసారి విప్లవాత్మకమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలన్న అంశంపైనే దృష్టి పెట్టింది. మహిళలే కేంద్రంగా కొన్ని కొత్త స్కీమ్‌లను తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే లోపే ఒకటో రెండో స్కీమ్‌లను అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు- పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వాటిని మేనిఫెస్టోలో పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు స్కీమ్‌ అమల్లోకి వచ్చినట్లు-గానే ఈసారి రైతు పింఛను పథకం ఉనికిలోకి వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతుబంధు కోసం సగటు-న రూ.15 వేల కోట్లు- ఖర్చు చేస్తున్నది. సుమారు 65 లక్షల మంది రైతులు దీని ద్వారా సాయం అందుకుంటు-న్నారు. ఇందులో లక్షల మంది మాత్రమే పది ఎకరాలకంటే ఎక్కువ సాగుభూములు ఉన్నారనేది ప్రభుత్వ అంచనా.

పేదల అభ్యున్నతి లక్ష్యంగా కేసీఆర్‌ ఆలోచన
మూడోసారి సీఎం అయ్యాక సంక్షేమ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలువాలన్న ధృడ సంకల్పంతో పేదల అభ్యున్నతి లక్ష్యంగా కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. ఇక గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసే ఆలోచన కూడా ఉన్నట్టు- సమాచారం. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే నెలకు 50 యూనిట్ల వరకు రాయితీ సౌకర్యం లభిస్తోంది. ఇకపైన దీనిని అన్ని ఇండ్లకూ వర్తింపజేస్తే పడే ప్రభావంపై ఆలోచిస్తున్నట్టు- తెలుస్తోంది. ఇప్పటికే బీసీ బంధు, గిరిజన బంధు లాంటి స్కీమ్‌లపైనా కేసీఆర్‌ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సిటీ- బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విషయాన్ని సైతం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, చెన్నయ్‌ నగరాల్లో ఈ స్కీమ్‌ అమలవుతుండగా మహిళల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తున్నది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఈ స్కీమ్‌ కారణంగా పడే భారమెంతో తెలుసుకోడానికి విశ్లేషణ మొదలైంది. అందులో భాగంగానే డైలీ బస్‌ పాస్‌ రేటు-లో మహిళలకు 20శాతం డిస్కౌంట్‌ విధానం పైలట్‌ బేసిస్‌గా అమలవుతోంది. మహిళా ఓటు- బ్యాంకును అనుకూలంగా మల్చుకోడానికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందో, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో అనే లెక్కలు తీసే పని మొదలైంది.

ఎన్నికల ప్రణాళికలో అధిక ప్రాధాన్యత మహిళలకే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు.. ఇలాంటి కేటగిరీలలో ప్రతి నెలా పింఛన్‌ రూపంలో రూ.2,016 అందిస్తున్నది. ఇకపైన దీనిని రూ.3,016 కు పెంచడం ద్వారా మహిళలకు ఉపయోగకరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భూముల రిజిస్ట్రేష్రన్లలో ప్రస్తుతం 7.5శాతం మేర స్టాంపు ఫీజు రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్నది. మహిళల పేరు మీద రిజిస్ట్రేష్రన్లు జరిగినట్లయితే దానిని 6.5 శాతానికే వర్తింప చేయాలన్నది బీఆర్‌ఎస్‌ ఆలోచన. రిజిస్ట్రేష్రన్‌ ఫీజు తగ్గించుకోడానికి ఇకపైన చాలా మంది దీన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశాలున్నట్టు- అంచనా. ఒకవైపు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం సీఎం కుమార్తె కవిత డిమాండ్‌ చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఒక స్పష్టమైన హామీని ఈ రూపంలో ప్రకటించడం సందర్భోచితంగా ఉంటు-ందన్నది గులాబీ పార్టీ అభిప్రాయం. ఇప్పటికే ఈ తరహా స్కీమ్‌ మహారాష్ట్రలో సక్సెస్‌ఫుల్‌గా అమలవుతోంది. అక్కడి క్షేత్రస్థాయి అనుభవాలను బీఆర్‌ఎస్‌లో ఇటీ-వల చేరిన నేతలు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

ఎండ్‌…

Advertisement

తాజా వార్తలు

Advertisement