Friday, May 3, 2024

కౌన్ బనేగా కరోడ్ పతిలో.. 12లక్షల 50వేలు గెలుచుకున్నపాన్ దుకాణదారుడు

కౌన్ బనేగా కరోడ్ పతిలో 12లక్షల 50వేలు గెలుచుకున్నపాన్ దుకాణదారుడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి14సీజ‌న్ కి హోస్ట్ గా చేస్తున్నారు. కాగా ఈ షోలో చిన్న పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే ఓ సామాన్యుడు పాల్గొన్నాడు. కేబీసీ 14 సీజన్ లో రూ.12.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రూపంలో ద్వారకాజిత్ మండలే సెలక్ట్ అయ్యారు. ఆయనే పాన్ దుకాణం యజమాని. పోటీదారుగా గేమ్ లోకి ఆయన్ని బిగ్ బీ అమితాబ్ ఆహ్వానించారు. మొదటగా రూ.1,000 ప్రశ్న సంధించే ముందు.. అది తన ఐదు రోజుల ఆదాయమని ద్వారకాజిత్ చెప్పాడు.

వెయ్యి రూపాయలు అన్నవి నాకు పెద్ద మొత్తం. ఒక్కసారి నా భార్యకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలని చెప్పా. ఆమె కుటుంబానికి కావాల్సినవన్నీ కొనుగోలు చేసింది. కానీ, తనకోసం ఏమీ తీసుకోలేదు అని అమితాబ్ తో చెప్పాడు. ద్వారాకాజిత్ రూ.10,000 గెలుచుకున్నాడు ఐదు నిమిషాల్లో 50 రోజుల ఆదాయం గెలుచుకున్నావ్. అదే ఈ గేమ్ మ్యాజిక్’’అని అమితాబ్ అన్నారు. ఈ బహుమతితో నీ చదువును పూర్తి చేస్తావా అని అడగ్గా.. తానున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ, తన భార్య చదువుకోవాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపాడు. చివరికి ద్వారాకాజిత్ రూ.12,50,000 లక్షల బహుమతితో గేమ్ నుంచి నిష్క్రమించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement