Thursday, April 25, 2024

రష్యాలో పుష్ప టీం.. దివ్యాంగుడితో బన్నీ ఫోజులు

రష్యాలో రిలీజ్ కానుంది పుష్ప చిత్రం.ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర టీం. కాగా ఓ దివ్యాంగుడి దగ్గరకు వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అతడి పక్కన ఉండి కెమెరాకు ఫోజులిచ్చారు. బన్నీ వచ్చి తనతో ఫొటోలు, సెల్ఫీలు దిగడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.మరోవైపు పుష్పరాజ్‌గా అలరిస్తున్న బన్నీని చూసి రష్యన్‌ మూవీ లవర్స్ ముచ్చటపడిపోయారు.

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్‌ రష్యా ఈవెంట్‌లో ప్రీమియర్స్ సందర్భంగా ఈవెంట్ ప్రతినిధులు పుష్ప టీంను సత్కరించారు. ఇప్పటికే రష్మిక రష్యా వీధుల్లో మూవీ లవర్స్‌ తో సందడి చేస్తున్న వీడియోలు నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన పుష్ప..ది రైజ్‌ నెక్ట్స్ ప్రీమియర్స్‌ డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఉండనున్నాయి. డిసెంబర్ 1న మాస్కోలో గ్రాండ్‌ ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్ సమయంలో హీరో, డైరెక్టర్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌, నిర్మాతలు తగ్గేదే లే అంటూ కెమెరాకు ఫోజులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement