Monday, January 30, 2023

ఎర్ర గంగిరెడ్డి బెయిల్​ రద్దు పిటిషన్ పై విచార‌ణ వాయిదా..

వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్​ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిష‌న్ ఈరోజు విచార‌ణ‌ జరిపిన‌ క్రమంలో విచారణను వాయిదా వేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపిస్తుంది. సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement