Friday, April 26, 2024

తెలంగాణలో కోటి మందికి కంటి వెలుగు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయ వంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 18 మొదలుకుని సీఎం కేసీఆర్‌తో పాటు-, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయ్‌ విజయన్‌ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజల కంటి సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తోంది. 47 పని దినాల్లో ఇప్పటి వరకు 96 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి కాగా, కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల జీవన స్థితిగతులపై సంపూర్ణ అవగాహన కలిగివున్న సీఎం కేసీఆర్‌ ఎవరూ అడగక ముందే కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిం చారు. పేదింటి పెద్ద కొడుకుగా ఆలోచించిన ఆయన, దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్‌ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు- కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి, నిర్విరామంగా, నిరంతరాయంగా కొనసాగిస్తోంది.

రెండో విడత కార్యక్రమంలో ఇప్పటి వరకు 47 పనిదినాల్లో మొత్తం 96,07,764 మందికి కంటి పరీక్షలు చేయగా, 60.55 శాతం లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇందులో 45 లక్షల మంది పురుషులు, 50 లక్షల మంది స్త్రీలు, 3112 మంది ట్రాన్స్‌ జెండర్స్‌ ఉన్నారు. 15.65 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ పంపిణీ చేయగా, 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌ కోసం గుర్తించడం జరిగింది. 68.73 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది.

అడగక ముందే అద్భుత పథకం: మంత్రి హరీశ్‌ రావు
”ఎవరూ అడగకముందే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతమైన కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్న లక్ష్యం మేరకు విజయవంతంగా కొనసాగుతు న్నది. 47 పనిదినాల్లో 60 శాతం మందికిపైగా కంటి పరీక్షలు చేయడం జరిగింది. లక్ష్యంగా నిర్దేశించుకన్న 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి పరీక్షలు పూర్తి చేస్తాం. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటు-న్నాం. వైద్య శాఖ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, ఇతర శాఖలు సహా, అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్వాలిటీ- కంట్రోల్‌ టీ-ంలను ఏర్పాటు- చేసి ప్రభుత్వం మానిటరింగ్‌ చేస్తున్నాం” అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement