Sunday, April 21, 2024

ఎడిటోరియ‌ల్ – పిల్ పేరిట వ్య‌క్తిగ‌త వ్యాజ్యాలు…

రాజకీయ నాయకులు ఈ మధ్య వ్యక్తిగతంగా ఆరోప ణలు, విమర్శలు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నా రు. ప్రజలు వారి వాగ్దానాలను విశ్వసించకపోవడం వల్ల నే. ఇలా ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతున్నాయి. వ్యక్తి గత విమర్శలు ఎంతవరకూ వెళ్తున్నాయంటే, ఇంట్లో ఉన్న వారిపై కూడా విమర్శలు చేస్తున్నారు. అలాగే, అర్హతలపై పరస్పరం దెప్పి పొడుచుకోవడం,తక్కువ చేసి మాట్లాడటం చేస్తున్నారు. ప్రసార మాధ్యమాల పరిథి పెరిగినతర్వాత ముఖ్యంగా సామాజిక మాధ్య మాల విస్తృతి పెరిగిన తర్వాత ప్రత్యర్ధులపై తాము చేసే ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయా లేదా అని ఆలో చించకుండా తమకు తోచిన రీతిలో ఆరోపణలు చేస్తున్నా రు. ట్రోలింగ్‌ల విషయంలో ఇటీవల హై దరాబాద్‌ డీసీపీ కొద్ది రోజుల క్రితం తీవ్రమైన హెచ్చరిక చేశారు. సెలబ్రిటీ ల పరువు ప్రతిష్టలను దెబ్బతీసే రీతిలో సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న ట్రోలింగ్‌లు సభ్యసమా జం తలదించుకునే రీతిలో ఉంటున్నాయి. ఎంతటి తీవ్ర మైన ఆరోపణలనైనా ఆవలి వారు ఖండిస్తే సరిపోతుంద నుకునే రోజులు పోయాయి. ఖండనలతోసరిపెట్టకుండా ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధ పడుతున్నారు. న్యాయస్థానాలు కూడా గతంలో మాదిరిగా కాకుండా ఇలాంటి కేసులను సీరియస్‌గానే తీసుకుంటున్నాయి. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) కింద దాఖలయ్యే కేసులపై సుప్రీంకోర్టు ఇటీవల తరచూ తీవ్రంగా స్పందిస్తోంది.

చౌకబారు అంశాలను అడ్డు పెట్టుకుని పిల్‌ దాఖలు చేయడానికి వస్తున్నవారు ఒక్కసారి ఆలోచించుకోవాలనీ,కోర్టుల సమయాన్ని వృధా చేయవద్దని పిటిషనర్లను సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పద్దతిమార్చుకోకపోతే భారీగా జరిమా నా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. న్యాయ స్థానాల అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్న పిటిషనర్లకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఉన్న త స్థానాల్లో ఉన్న వారిని విమర్శించినా, వారిపై ఆరోపణ లు చేసినా ప్రాచుర్యం పొందవచ్చన్న ఉద్దేశ్యంతో కొంద రు పిటిషన్లను దాఖలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పిటిష న్లు ప్రహసనంలా తయారవుతున్నాయి. ఢిల్లి ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఆదాయం పన్ను శాఖలో కమిషనర్‌ స్థాయి హోదాని నిర్వహించి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రభావంతో సమాజ సేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. అన్నాహజారే శిష్యునిగా పేరు సంపాదించుకున్న తర్వాత ఆయన హజారే మార్గానికి భిన్నంగా రాజకీయాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్‌, బీజేపీ లకు వ్యతిరేకంగా దేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన కృషి ప్రారంభించారు. అది ఫలించడం ప్రారంభమైన తర్వాత ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ప్రారంభించారు.ఆ విమర్శలు రాజకీయాల పరిథి దాటిపోయి వ్యక్తిగత ఆరోపణల వరకూ వెళ్తున్నాయి.

మోడీ విద్యార్హతను ప్రశ్నించడం వరకూ వెళ్ళారు. మోడీ అర్హతలపై కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టి వేసింది.మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు చూపించాలంటూ ఆ పిటిషన్‌లో కేజ్రీవాల్‌ కోరారు. ఎన్నికల సందర్భంగా మోడీ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను పురస్కరించుకుని తాము వివరాలను అడుగుతున్నానని కేజ్రీవాల్‌ అన్నారు.దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇది ప్రజలకు సంబంధించిన విషయమా అని ప్రశ్నించి కేజ్రీవాల్‌కి 25వేల రూపాయి ల జరిమానాను విధించారు. వ్యక్తిగత ఆరోపణలు చేసే వారికి ఇది ఒక బెదురు వంటిది.దేశంలో ఇలాంటి పిటిష న్‌లు సుప్రీంకోర్టు నుంచి దిగువ కోర్టుల వరకూ దాఖలు అవుతూనే ఉన్నాయి. ప్రజాప్రయోజనాల పేరిట ప్రత్య ర్ధులతో అమీతుమీ తేల్చుకోవడానికి రాజకీయ నాయకు లు వేసే పిటిషన్లకు అడ్డుకట్ట పడాలి. లేని పక్షంలో న్యాయమూర్తులే అన్నట్టు, కోర్టుల విలువైన సమయం వృధా అవుతుంది. కోర్టులలో ఇప్పటికే కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యవర్తి పరిష్కారం ద్వారా పరిష్కరించుకోదగినవి కూడా కోర్టుల విలువైన సమ యాన్ని హరిస్తున్నాయి. కనుక ఎంతో ప్రాధాన్యం ఉన్న అంశాలపై కానీ, పిల్‌ వేయకుండా చూసేందుకు సంబం ధిత వర్గాలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కోర్టుల్లో దాఖలయ్యే ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల్లో (పిల్‌) చాలా మటుకు వ్యక్తిగత విషయాలనే పిటిషనర్లు ప్రస్తావించడం న్యాయమూర్తులకే కాక, ప్రజలకు కూడా అసహనం కలుగుతోంది.ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే పదిమందికి ఉపయోగ పడేట్టుగా ఉండాలే తప్ప వ్యక్తుల సొంత విషయాలను ఏకరవు పెట్టేవిగా ఉండ కూడదతు. ప్రధానమంత్రి మోడీ విషయంలోనే కాదు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,పెద్ద హోదాల్లో ఉన్న వారి వ్యక్తిగత విషయాలను పిటిషన్లలో ప్రస్తావిం చడం జుగుప్సాకరం. గతంలో పెద్దల విషయంలోనే ఈ పిటిషన్లు వేసే పద్దతి ఉండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement