Tuesday, May 7, 2024

పీజీ వైద్య ప్రవేశాలకు తుది నోటిఫికేషన్.. రేపే లాస్ట్ ఛాన్స్

పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వరంగల్ కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తికాగా.. ఇంకా మిగిలి ఉన్న కన్వీనర్ కోటా సీట్లను ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు ఈ నెల 28వ తేది మధ్యాహ్నం 2గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గత విడత కౌన్సిలింగ్ లో సీటు అలాట్ అయి చేయకపోయినా, చేరి వదిలివేసిన అదే విధంగా అఖిల భారత కోటాలో ఇప్పటికే సీటు పొందినటువంటి విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులుగా పేర్కొంది. ప్రస్తుతం కాళోజి హెల్త్ యూనివర్సిటీ అలాగే ఆలిండియా కోటా రెండింటి పరిధిలో ఏ సీటు లేని విద్యార్థులు ఒక సారి మినహాయింపుగా వారిని కౌన్సిలింగ్ కు అర్హులుగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కోటా మాప్ ఆప్ విడత కౌన్సిలింగ్ రద్దు చేసిన నేపథ్యంలో ఆలిండియా కోటా మాప్ ఆప్ విడత కౌన్సిలింగ్ లో పొందిన సీటును విడిచిపెట్టిన విద్యార్థులకు రాష్ట్ర కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించింది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement