Tuesday, May 7, 2024

Bigg Boss 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? టాప్ 5లో నిలిచేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి మజిలికి చేరుకుంది. 14వ వారం ఎలిమినేషన్‌కి రంగం సిద్దమైంది. ఈవారం నామినేషన్స్‌లో కాజల్, మానస్, సిరి, షణ్ముఖ్, సన్నీలు ఉన్నారు. శ్రీరామ్ చంద్ర టికెట్ టు ఫినాలే ద్వారా ఫైనల్‌కి చేరాడు. దీంతో ఇప్పుడు శ్రీరామ్ మినహా మిగత ఐదుగురు ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. ఇక, నిన్నటి ఎపిసోడ్ లో రెండో ఫైనలిస్ట్ గా సన్నీ చేరాడు. అయితే, ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వ్యక్తి ఎవరు? అన్నది ఆస్తకి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

ఓటింగ్‌లో సన్నీ టాప్ లో దూసుకుని పోగా.. రెండో స్థానంలో షణ్ముఖ్ ఉన్నాడు. సిరి, మానస్ కి ఓటింగ్ బాగా రావడంతో సేఫ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మానస్-కాజల్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయితే, ఈ ఇద్దరిలో మానస్ సేఫ్ అయ్యి కాజల్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఇక, మిగిలిన వారి టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ను ఎవరు వీడుతార్నది ఎపిసోడ్ లోనే తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement