Friday, April 26, 2024

హాలీవుడ్ చిత్రంలో ధ‌నుష్ : నెట్ ప్లిక్స్ లో రిలీజ్

హాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ర‌స్సో బ్ర‌ద‌ర్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ది గ్రే మ్యాన్. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టిస్తుండ‌టం విశేషం. ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. ఈ సినిమాని త్వ‌రలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదిక గా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా పై హీరో ధ‌నుష్ స్పందించాడు. త‌న‌కు హాలీవుడ్ సినిమా ద‌క్క‌డం అదృష్టం గా భావిస్తున్నాని అన్నాడు. ఈ చిత్రంతో న‌టుడి గా కొత్త గా చాలా పాఠాలు నెర్చుకున్నాని తెలిపారు. అలాగే ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కొంత వ‌ర‌కు జ‌రిగింద‌ని తెలిపాడు. మిగిత షూటింగ్ కూడా త్వ‌రలో నే జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. ఈ చిత్రంలో రియాన్ గోస్లింగ్,క్రిస్ ఎవాన్స్, అనా డి ఆర్మాస్,జెస్సికా హెన్విక్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. కాగా ది గ్రే మ్యాన్ చిత్రం గ్రీనీ అనే ర‌చ‌యిత రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొందుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement