Monday, April 29, 2024

స్పీడందుకున్న‌ రైలు నుంచి దూకేసింది.. కాపాడిన రైల్వే పోలీస్‌..

పశ్చిమ బెంగాల్ లోని పురూలియా రైల్వే స్టేషన్ లో ఈరోజు అనూహ్య ఘటన జ‌రిగింది. క‌దులుతున్న రైలు నుంచి దిగబోతూ ఓ మహిళ రైలు కింద ప‌డ‌బోయింది. గమనించిన రైల్వే పోలీసు వేగంగా వెళ్లి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది..

అస‌లేం జరిగిందంటే?
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్విట్టర్ షేర్ చేసిన వివ‌రాల‌ ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా రైల్వే స్టేషన్ లో సాంత్రాగాచి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్‌ ఆ స్టేషన్ ను విడిచి వెళ్తోంది. అయితే కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. వారు దిగుతూనే రైలు నుంచి దూకేశారు. ఈ క్ర‌మంలో ఒక మహిళ ప్లాట్‌ఫాం మీద పడిపోయింది. మరో మహిళ మాత్రం పట్టకోల్పోవడం వల్ల ప్రమాదకర స్థితిలోకి జారిపోయింది. ఆమె తల కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య వరకు చేరుకుంది. ఇదంతా చూస్తున్నప్ర‌యాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

అప్పుడు అక్కడే డ్యూటీలో ఉన్న‌ ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బబ్లు కుమార్ చాలా స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారు. వేగంగా పరుగెత్తి ఆ మహిళను వెనక్కి లాగారు. అక్కడ వేచి ఉన్న ప్రయాణికులు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటన నవంబర్ 29న జరిగిందని ఆర్‌పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement