Sunday, May 12, 2024

రేప్ చేసి-మాన‌వ మాసం వండించి -నిర్భంధంలో ఉన్న‌వారికి వ‌డ్డించిన‌ మిలిటెంట్ లు

మాన‌వ‌మృగాలుగా మారారు కాంగోలో మిలిటెంట్ గ్రూపులు. మహిళా హక్కుల కోసం పోరాడే ఓ సంస్థ (సోఫ్ ప్యాడి) ప్రెసిడెంట్ జులియెన్నే లుసెంజే.. కాంగోలో ఓ మహిళ ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని 15 సభ్యులు గల భద్రతా మండలికి తెలియజేసింది. కాంగోలోని పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చిస్తున్న సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ సర్కారు, మిలిటెంట్ల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉండడం గమనార్హం. ఒక మహిళను రెండు మిలిటెంట్ గ్రూపులు కిడ్నాప్ చేసి ఎన్నో పర్యాయాలు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమెతో మానవ మాంసాన్ని వండించినట్టు భద్రతా మండలికి హక్కుల సంస్థ ప్రెసిడెంట్ వివరించారు.

ఒక మహిళ తన కుటుంబ సభ్యుడు అపరహరణకు గురి కావడంతో పరిహారం చెల్లించి విడిపించుకునేందుకు వెళుతుండగా, కొడెకో అనే మిలిటెంట్ గ్రూపు ఆమెను అపరహరించుకుపోయింది. ఆమెపై ఒకరి తర్వాత ఒకరు ఎన్నో సార్లు అత్యాచారం చేశారు. భౌతికంగా గాయపరిచారు. తీవ్రవాదులు ఓ వ్యక్తి గొంతు కోసిన తర్వాత అతడి మాంసాన్ని వండాలంటూ మహిళను ఆదేశించారు. తమ నిర్బంధంలో ఉన్న వారికి ఆ మాంసం వడ్డించారు. కొన్ని రోజుల తర్వాత బాధిత మహిళ వారి చెర నుంచి బయటపడి ఇంటికి వెళుతున్న క్రమంలో మరో మిలిటెంట్ గ్రూపు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసింది. అక్కడ కూడా ఆమెతో మానవ మాంసం వండించారు. వారి చెర నుంచి కూడా ఆమె తప్పించుకు వచ్చి.. హక్కుల సంస్థకు జరిగింది వివరించింది. ఈ విష‌యం ఐక్య‌రాజ్య స‌మితి దృష్టికి వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement