Thursday, May 23, 2024

న‌టి జాస్మిన్ భాసిన్ కి ఉమెన్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డ్ – తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

బాలీవుడ్ న‌టి జాస్మిన్ భాసిన్ వీడియో ఒక‌టి వైర‌ల్ గా మారింది. జాస్మిన్ భాసిన్ ‘ఉమెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకోవ‌డానికి ఆమె గ్లామర్‌గా త‌యారై వ‌చ్చింది.. నారింజ రంగు దుస్తుల్లో మెరిసింది ఈ బ్యూటీ. ఓ వ్యక్తి అనుకోకుండా జాస్మిన్ డ్రెస్ ను తొక్కాడు. జాస్మిన్ సరైన సమయంలో హఠాత్తుగా అక్కడ ఆగిపోతుంది. అదే జాస్మిన్ వేగంగా వెళ్లి ఉంటే, ఆమె పడిపోవ‌డ‌మో లేదా డ్రెస్ చిరిగిపోవ‌డ‌మో జ‌రిగేది. కాగా జాస్మిన్ భాసిన్ దుస్తులపై చాలా మంది కామెంట్స్ చేశార‌. “ఇది గందరగోళంగా ఉంద‌న‌గా.. “ఇది ఏమి డ్రెస్ అని మ‌రో నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. జాస్మిన్ భాసిన్ తషాన్-ఎ-ఇష్క్ .. దిల్ సే దిల్ తక్ వంటి టీవీ సీరియల్స్ చేసింది. బిగ్ బాస్ 14వ సీజన్‌లో కూడా మెరిసింది. జాస్మిన్ .. టీవీ యాక్టర్ అలీ గోని మధ్య ఉన్న సంబంధం గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ తమ పెళ్లి గురించి మీడియా ముందు మాట్లాడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement