Saturday, June 15, 2024

Bank Holiday | జూన్‌ నెలలో బ్యాంకు సెలవులివే.. ఎన్ని రోజులంటే?

దేశవ్యాప్తంగా వచ్చే నెల (జూన్) అన్ని రాష్ట్రాలతో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాటిని ఒకసారి చూద్దాం… జూన్ 2వ తేదీ ఆదివారం, రెండవ శనివారం 8వ తేదీ, ఆదివారం 9వ తేదీ, 15వ తేదీ మిజోరం, ఒడిశాలో, 16వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

ఈద్-ఉల్-అధా సందర్భంగా మిజోరం, సిక్కిం , ఇటానగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ 17 సెలవు ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో 18వ తేదీ, 22వ తేదీ నాలుగో శనివారం, 23వ ఆదివారం, 30వ తేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement