Friday, April 26, 2024

భార‌త్.. అమెరికా దేశాల మ‌ధ్య ఐసెట్ ఒప్పందం

భార‌త్..అమెరికా దేశాల మ‌ధ్య ఐసెట్ ఒప్పందం జ‌రిగింది.ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా సెమీకండక్టర్లు, సైనిక పరికరాలు, కృత్రిమ మేధస్సుతో ఇరు దేశాలు చైనా టెక్నాలజీతో పోటీ పడగలవని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విశ్వాసం ప్రకటించారు.చైనా టెక్నాలజీ సమస్యను ఎదుర్కోవడానికి ఐసెట్ ఒప్పందంపై భారత్‌-అమెరికా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సుల్లివన్‌ల సమక్షంలో ఒప్పంద పత్రాలను ఇరుదేశాల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తుందని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఒప్పందం సందర్భంగా రెండు దేశాల భద్రతా సలహాదారుల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల్లో సాంకేతికత బదిలీ విషయంలో అనేక అడ్డంకులు తొలగిపోయాయని సూచించింది. ఇది రెండు దేశాల మధ్య పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేస్తుందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement