Thursday, April 25, 2024

Big Breaking : ఐపిఎల్ పై సినిమా -ల‌లిత్ మోడీ బ‌యోపిక్- ప్ర‌క‌టించిన నిర్మాత విష్ణు వ‌ర్థ‌న్ ఇందూరి

ఐపిఎల్ పై సినిమా తెర‌కెక్క‌నుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్, త‌లైవి, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయగాథ ఆధారంగా ’83’ అనే చిత్రాల‌ను తెర‌కెక్కించారు నిర్మాత విష్ణు వ‌ర్థ‌న్ ఇందూరి. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన “మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ సాగా” పుస్తకాన్ని వెండి తెరపైకి తీసుకురావడానికి తెలుగు నిర్మాత సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ IPL ఆధారంగా తెరకెక్కనుంది. ఐపీఎల్ కాన్సెప్ట్ వెనుక సూత్రధారి లలిత్ మోదీ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ సాగా” పుస్తకాన్ని ఫీచర్ ఫిల్మ్‌గా మార్చనున్నట్లు విష్ణు ఇందూరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీలో నటించబోతున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement