Monday, May 6, 2024

Breaking: ఇంట‌ర్ ఎగ్జామ్స్ షెడ్యూల్​ రిలీజ్​​.. ఒక్క నిమిషం లేట్​ అయినా నో ఎంట్రీ!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్మీడియెట్ వార్షిక ప‌రీక్ష‌లు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి అధికారులు ఫుల్​ రిస్ట్రిక్షన్స్​ పెడుతున్నారు. ఎగ్జామ్​ సెంటర్​లోకి ఒక్క నిమిషం లేట్​గా వచ్చినా సరే.. ప‌రీక్షా కేంద్రాల్లోకి విద్యార్థుల‌ను అనుమ‌తించబోమని ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ స్ప‌ష్టం చేశారు. ఈ సూచ‌న‌ను విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాల‌ని కోరారు. ఇక.. కొవిడ్, ఎండ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, అందుకు త‌గ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

పరీక్ష‌లు ముగిసిన నెల రోజుల్లో ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఉమర్​ జలీల్​. ఫ‌లితాలు వ‌చ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు 1,443 కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

ఎగ్జామ్స్ ఉద‌యం 9 నుంచి మ‌.12 గంట‌ల వ‌ర‌కు..
ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు 6 నుంచి మే 23వ తేదీ వ‌ర‌కు, సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు 7 నుంచి 24 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఫ‌స్టియ‌ర్ షెడ్యూల్
మే 6(శుక్ర‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9(సోమ‌వారం) – ఇంగ్లీష్
మే 11(బుధ‌వారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
మే 13(శుక్ర‌వారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
మే 16(సోమ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 18(బుధ‌వారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
మే 20 (శుక్ర‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1
మే 23(సోమ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

=====================================

- Advertisement -

సెకండియ‌ర్ షెడ్యూల్
మే 7(శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్
మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
మే 14(శ‌నివారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
మే 17(మంగ‌ళ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
మే 21 (శ‌నివారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2
మే 24(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

======================================

Advertisement

తాజా వార్తలు

Advertisement