Wednesday, May 15, 2024

Inida Today’s Exclusive – కె సి ఆర్ ది ఒక‌టే గురి….’హ్యాట్రిక్’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్‌ ఒకవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోవైపు …రెండుసార్లు అధికారంలో ఉండి సహజంగానే ఎంతోకొంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఒక్కడే ఇంకోవైపు…అయినా ఆయన మూడోసారి అధికారం దక్కించుకునేనా…? అంటే బీఆర్‌ఎస్‌ వర్గాలేకాదు, జాతీయ స్థాయిలోనూ ఆయన పక్కాగా మరో డక్కా ఇస్తాడనే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈ ఎన్నికలపై ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎప్పటికీ గట్టి పోటీ కాదనుకున్న కాంగ్రెస్‌ తెలంగాణలో మెల్లగా పుంజుకుంటోంది. ఇంకోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా సరే అధికారం తమదేననే ధీమా బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేస్తోంది. ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇకపై అమలు చేసేందుకు తాము ప్రకటించిన మ్యానిఫెస్టోనే తమను అధికార తీరం చేరుస్తుందనే ధీమాతో ఉన్నారు.


ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి 2018 ఎన్నికల్లో గెలుపొందిన సీట్లకంటే ఇంకా ఎక్కువే గెలుస్తామని అధినేత కేసీఆర్‌ ధీమాతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అంచనాల ప్రకారం తాజా ఎన్నికల్లో తమ పార్టీ 95నుంచి 100 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని చెబుతున్నారు. ఇందుకు పార్టీ బలమైన కారణాలనే చెబుతూ వస్తోంది. తెలంగాణలోనే కాదు అబ్‌ కీ బార్‌ దేశ్‌మే కిసాన్‌ సర్కార్‌ అంటూ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. తెలంగాణలో పక్కాగా తమదే అధికారం అని హ్యాట్రిక్‌ సాధనలో వెనుదిరిగి చూసేదిలేదనే విశ్వాసం పార్టీ నేతల్లో, అభ్యర్ధుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారానికి లభిస్తున్న ప్రజాదరణ ఇందుకు తిరిగులేని సాక్ష్యమని పార్టీ అభిప్రాయపడుతోంది.


నిరుద్యోగం రూపుమాపడంలో, ఉపాధి కల్పనలో తెలంగాణ అద్భుత పరిణితిని సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 14నుంచి 15శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 5శాతానికి పడిపోయింది. ఇవి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన లెక్కలే కావడం గమనార్హం. రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు వలసలు తెలంగాణకు అతిపెద్ద శాపంగా ఉండేది. అయితే ఇప్పుడీ పరిస్థితి తిరగబడటాన్ని సీఎం కేసీఆర్‌ అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇతర రాఁష్టాల కార్మికులు ఇప్పుడు తెలంగాణలో ఉపాధికి పోటెత్తుతున్న పరిస్థితి. దాదాపు 12కుపైగా రాష్ట్రాలనుంచి కార్మికులు, రకరకాల రంగాల్లో ఉపాధిని పొందుతున్న ప్రజలు తెలంగాణవైపు కదిలొస్తున్నారు. జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2.5 మిలియన్లకు పెరగడంలో ఈ రివర్స్‌ వలసలు కారణమవుతున్నాయి. వీంతో రాష్ట్ర, దేశ సంపద పెరుగుతోంది. దేశ సంపదలో తెలంగాణ వాటా కీలకంగా మారింది.


అయితే వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టి తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీలేదన్న అనుమానాలు, ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న వాదనలను బీఆర్‌ఎస్‌ పటా పంచలు చేస్తోంది. జ్యోతిబసు, నవీన్‌ పట్నాయక్‌లు పలుమార్లు ప్రజావ్యతిరేకతను ఎదుర్కోకుండానే వరుసగా దశాబ్దాలపాటు ముక్యమంత్రులుగా కొఓనసాగిన ఉదంతాలను గుర్తు చేసుకుంటూ మరోసారి హ్యాట్రిక్‌ ఖాయమనే ధీమాతో ప్రజల్లోకి వెళుతోంది.
అయితే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, బూకబ్జాలపై కూడా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ధీటుగా సమాధానం చెబుతోంది. గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కూడా అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదని, డబ్బులు వసూలు చేసేటంతటి చెడ్డపేరు తెచ్చుకోలేదని చెబుతోంది. ఒకవేళ తెలంగాణలో అవినీతి ఉండిఉంటే జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, బడా పెట్టుబడిదారులు క్యూ ఎందుకు కడుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలేనని, పసలేని ప్రత్యర్ధుల కుట్రలేనని బీఆర్‌ఎస్‌ ప్రజలకు వివరిస్తోంది.

రాష్ర ఆవిర్భావం జరిగిన తర్వాత విద్యుత్‌ కొరత, తాగు, సాగునీటి కొరత, అన్ని రంగాల్లో నిర్లక్ష్యం ఒక్కోటి ధీటుగా, ముందుచూపుతో అధిగమించిన తీరును మరోసారి ప్రజలకు గుర్తు చేస్తోంది.
ఎక్కడి తెలంగాణ ఎక్కడికి ప్రస్తానం అంటే ఉదాహరణగా వరి ధ్యానం ఉత్పత్తిని, సాగు విస్తీర్ణం పెరుగుదలను గమనిస్తే సరిపోతుంది. తెలంగాణలో 2014లో 7 మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తి అయితే నేడు అది 26 మిలియన్‌ టన్నులకు చేరింది. రౌస్‌ బౌల్‌ ఆఫ్‌ దక్షిణ భారత్‌గా మారిన తెలంగాణ త్వరలో పంజాబ్‌ను అధిగమించేందుకు రెడీ అవుతున్నది. దేశంలో నెంబర్‌ 1గా మారి దేశానికి అన్నపూర్ణగా వెలుగొందేందుకు సిద్దమవుతున్నది.
దేశంలో వ్యవసాయం పరిరక్షించబడాలంటే ప్రభుత్వాల సహకారం తప్పనిసరిని గుర్తెరిగిన ప్రభుత్వం ఈ రంగానికి ఇతోధిక ప్రాధాన్యతనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ఎక్కడా రైతుకు ప్రభుత్వాల సహకారం అందడంలేదని గుర్తించిన తెలంగాణ సర్కార్‌ విప్లవాత్మకంగా నగదు సహకారాన్ని అందించాలని నిర్ణయించింది. రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 5వేల చొప్పున ఏడాదికి రెండు దశల్లో సాయాన్ని అందిస్తున్నది.
ఇక బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామిక అనుమతులకు తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ దేశంలోనే పరికొత్త చర్చకు దారితీసింది. 57 రకాల అనుమతులను సింగిల్‌విండోద్వారా 15 రోజుల్లోనే ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్లైన్లో అందించే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. తద్వారా 22745 ఇండస్ట్రీలు స్థాపితమై రూ. 2.6లక్షల కోట్ల పెట్టుబడులు వరదలా పారాయి. 1.7మిలియన్ల ఉద్యోగాలు కల్పించిన ఘనత సొంతం చేసుకున్నది. 2013-14లో 57వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ. 3లక్షల కోట్లకు చేరుకున్నాయి. బెంగుళూరును అతిత్వరలో అధిగమించే లక్ష్యంతో ఐటీలో తెలంగాణ అప్రతిహతంగా పురోగమిస్తున్నది.
ఇలా అన్ని రంగాలతో సుసంపన్నంగా వెలుగొందుతున్న తెలంగాణలో ఈ దఫా బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధన ఖాయమనే విశ్వాసం తొణికిసలాడుతోంది. నిర్లక్ష్యానికి, విధ్వంసాలకు గురైన అన్ని రంగాలను ఒక్కొక్కటిగా పునర్నించుకుంటూ ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ప్రజా దీవెనలు తథ్యమనే భావన వ్యక్తమవుతోంది. కష్టపడి పునర్నిర్మించుకున్న తెలంగాణలో మరోసారి విచ్చిన్నకారులు, ఢిల్లిd గులాముల చేతిలో అధికారం పెట్టేందుకు ప్రజలు సిద్దంగా లేరన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement