Friday, October 4, 2024

ODI World Cup | భారత్​ ఆల్​రౌండ్​ ప్రతిభ, తక్కువ స్కోరుకే తలవంచిన ఆసీస్​!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో భారత జట్టు ఆల్​రౌండ్​ ప్రతిభ చూపుతోంది. అటు బౌలింగ్​ .. ఇటు ఫీల్డింగ్​ పరంగా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. ఇక.. ఈ మ్యాచ్​లో బౌలర్ రవీంద్ర జడేజా స్పిన్నింగ్​ మ్యాజిక్ భలేగా వర్కవుట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. సెకండ్​ బ్యాటింగ్​కు దిగనున్న భారత జట్టు ముందు 200 పరుగుల లక్ష్యం ఉంది..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

  • ‌‌ఆట ప్రారంభంలో 6 బంతులు మాత్రమే ఆడిన మిచెల్ మార్ష్ ఒక్క పరుగు కూడా చేయకుండానే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి పెవిలియన్​ చేరాడు. వరల్డ్ కప్‌‌ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్‌ని ఆదిలోనే డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు..
  • ఆ తర్వాత డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి ఇన్నింగ్స్​ చక్కదిద్దే పనిలోపడ్డారు. రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, ఏబీ డివిల్లియర్స్ రికార్డులను ఇవ్వాల జరిగిన మ్యాచ్​లో డేవిడ్ వార్నర్ బ్రేక్ చేశాడు.. 
  • 52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

  • క్లియర్‌గా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకుని ఓ రివ్యూని లబుషేన్ వేస్ట్​ చేశాడు. అదే ఓవర్‌లో అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెండు బంతులాడిన అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఈ మ్యాచ్​లో భారత జట్టు ఫీల్డింగ్​ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. 21.4 నుంచి 31.5 ఓవర్ల మధ్య 12.1 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం.. 

  • కాగా, డేవిడ్​ వార్నర్​ (41), మిచెల్​ మార్ష్​ (0), స్టీవ్​ స్మిత్​ (46), లబుశేన్​ (27), మ్యాక్స్​వెల్​ (15), అలెక్స్​ క్యారీ (0), కెమరూన్​ గ్రీన్​ (8), పాట్​ కమ్మిన్స్​ (15), మిచ్చెల్​ స్టార్క్​ (28), హాజిల్ వుడ్​ 1 పరుగులు చేశారు.
  • ఇక.. బుమ్రా 2, అశ్విన్​1, కుల్దీప్​ యాదవ్​ 2, రవీంద్ర జడేజా 3, హార్దిక్​ పాండ్యా1 వికెట్​ తీయగా.. కట్టుదిట్టమైన బౌలింగ్, లైన్​ అండ్​ లెంగ్త్​ బాల్స్​తో హైదరాబాదీ కుర్రడు మహ్మద్​ సిరాజ్​ ఆకట్టుకున్నాడు. ఒక వికెట్​ తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement