Friday, April 26, 2024

జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్‌ కీలక ప్రస్థానం : నిర్మలా సీతారామ‌న్

జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్‌ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆగ్రిటెక్, స్టార్టప్ లకు ప్రాముఖ్యం ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అగ్రి స్టార్టప్ లకు చేయూత నిస్తామని, ఫండింగ్ చేస్తున్నామన్నారు. ఆత్మనిర్బర భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని ఆమె వెల్లడించారు. తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నా నిర్మిలా సీతారామన్‌.. దేశంలో తృణధాన్యాలకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. తృణధాన్యాల ఉత్పత్రిలో మనం ముందున్నామని, ఎగుమతుల్లో మనం ముందున్నామన్నారు. తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ ఆహారం వందల ఏళ్ళ నుంచి వస్తోందన్నారు. చిన్న రైతులు తృణధాన్యాలు పండించాలని నిర్ణయించామన్నారు.

ప్రపంచ సవాళ్లను భారత్‌ ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఎదుర్కొని నిలబడిందన్నారు. అంతేకాకుండా.. వృద్ధిరేటు 7శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ లో ఏడు అంశాలకు ప్రాధాన్యతసబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. దేశంలో అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి చేయూత నిస్తామన్నారు. జమ్మూకాశ్మీర్, లఢాక్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పంటల దిగుబడి, బీమాకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement