Wednesday, April 17, 2024

రియ‌ల్ దందా – ఐటి కొర‌డా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను టార్గెట్‌ చేస్తూ గత కొంత కాలంగా ఆదాయపు పన్నుశాఖ విస్తృతంగా దాడులు నిర్వహి స్తోంది. రాజధాని నగరం హైదరాబాద్‌ చుట్టూ శరవేగంగా విస్తరిస్తున్న నిర్మాణ రంగంలో జరుగుతున్న అక్రమాలపై కొరడా ఝళిపిస్తోంది. ఈ ఏడాది జనవరి నెల మొదలుకుని అరడజను పర్యాయాలకు పైగా ఈ దాడులు జరిగాయి. తాజాగా మంగళవారం మూడు రియల్టి సంస్థలు, ఒక ఫార్మా కంపెనీల కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి. సుమారు 50కి పైగా బృందాలు, 40 చోట్ల ఏకకాలంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రంగంలోకి దిగిన అధికారులు అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా తనిఖీలు నిర్వహించారు. ఆయా కంపెనీలు, సంస్థలు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌ పత్రాల్లో అక్రమాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ దాడులు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.

నాలుగు ప్రధాన స్థిరాస్తి సంస్థలపై కొరడా
వసుధ ఫార్మా కెమ్‌ ప్రైవేట్‌ లిమి-టె-డ్‌తో పాటు- పలు చోట్ల ఐటీ- సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా మొత్తంగా 40 చోట్ల ఐటీ- సోదాలు నిర్వహిస్తున్నారు. వెర్టెక్స్‌, రాజపుష్ప, ముప్ప, ఆదిత్య రియాల్టిd సంస్థలు, వసుద ఫార్మా కంపెనీల కార్యాలయాలు, ఈ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్ళల్లోనూ సోదాలు జరిగాయి. మరో 48 గంటలపాటు వసుద ఫార్మా చైర్మన్‌ రాజుతో పాటు- డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వసుద ఫార్మాతో పాటు- రాజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నారు. అడ్డదారి కంపెనీల పేరుతో రాజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు- తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఐటీ- సోదాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్ల్రో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 35 టీ-మ్‌లుగా విడిపోయి ఐటీ- సోదాలు నిర్వహించింది. రియల్‌ ఎస్టేట్‌, సినిమా, ఫైనాన్సియర్స్‌ ఇళ్లపై దాడులు నిర్వహించింది.

ప్రాజెక్టుల వారీగా వివరాల సేకరణ
స్థిరాస్తి వ్యాపార రంగంలో ఆర్థిక వ్యవహారాల్లో అదుపుతప్పి దూసుకుపోతున్న సంస్థలపై బాదితుల నుంచి అందిన కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో మరింత లోతుగా పత్రాల పరిశీలన జరుగుతోంది. బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో ఉన్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్‌ మాధవరెడ్డి, అతని కార్యాలయంతోపాటు- ఇల్లు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై సోదాలు సాగించింది. అలాగే ఊర్జిత ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమి-టె-డ్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వీర ప్రకాష్‌ నివాసాలు, వారి కార్యాలయాల్లోనూ ఐటీ బృందాలు సోదాలు నిర్వహించింది. ప్రముఖ బిల్డర్‌కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు- ఆరోపణలు ఉన్నాయి. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్‌, జూబ్లీ హిల్స్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, పంజాగుట్టలో ఐటీ- సోదాలు జరిగాయి. సీఆర్‌పీఎఫ్‌ బలగాల మధ్య ఏక కాలంలో తెలుగు రాష్ట్రాల్ల్రో సోదాలను నిర్వహించడం జరిగింది. ఇటీ-వల కాలంలో ఓ పార్టీలో చేరిన ప్రముఖ రాజకీయ నేత నివాసం, కార్యాలయంలో సైతం సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే తిరిగి తెల్లవారు జామునే ఐటీ- సోదాలకు దిగింది.

ఏపీ, తెలంగాణ రెండుచోట్లా ఏకకాల దాడులు
ఆయా సంస్థలు, కంపెనీల ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వారికున్న అన్ని కార్యాలయాలపైనా ఏకకాలంలో దాడులు జరుగడం గమనార్హం. గత కొద్దిరోజులుగా గ్యాప్‌ ఇచ్చిన ఐటీ- అధికారులు తాజాగా మరోసారి మంగళవారం ఉదయం నుండే హైదరాబాద్‌తో పాటు- ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ముందస్తు ప్రణాళికతో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందాలు, ఎక్కడ ఏ బృందం వెళ్ళాలో ఒకరోజు ముందుగానే నిర్ణయించి దాదాపు నలభై చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు. నగరంలోని మాదాపూర్‌ లో వసుధ ఫార్మా కెమికల్స్‌ సంస్థల్లో ఐటీ- అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా పేరుతో వెంకటరామ రాజు అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తూ మరో 15 కంపెనీల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నట్లు- ఐటీ- అధికారులు గుర్తించారు. ఇవన్నీ అక్రమాలతో కూడినవిగా వారికి ముందస్తు సమాచారం అందింది. వసుధ ఫార్మా ఛైర్మన్‌గా వెంకటారామ రాజు కొనసాగుతుండగా అతడి ఇళ్లతో పాటు- సంస్ధ డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ- అధికారులు సోదాలు జరుపుతున్నారు. వసుధ ఫార్మా సంస్ధకు ఆరుగురు డైరెక్టర్లు ఉండగా, వారందరి ఇళ్లల్లో ఐటీ- దాడులు జరుగుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్ల్రో కూడా పలుచోట్ల ఐటీ- సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ, వైజాగ్‌, నరసాపురం, రాజమండ్రిలో ఐటీ- సోదాలు కొనసాగుతున్నట్లు- తెలుస్తోంది.

వసుధా ఫార్మాపై స్పెషల్‌ ఫోకస్‌
వసుధా ఫార్మాపై ఐటీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ ఒక్క కంపెనీ కోసం కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో రెండు టీమ్‌లు, మాదాపూర్‌లోని మరో కార్పొరేట్‌ కార్యాలయంలో నాలుగు టీ-మ్‌ లు సోదాలు జరుపుతున్నాయి. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టు-బడులు పెట్టారు వెంకట రామరాజు. గతంలో పలు రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో వసుధ ఫార్మా పెట్టు-బడులకు సంబంధించిన ఆధారాలు అధికారులకు లభించాయని, వాటి ఆధారంగానే సోదాలు చేస్తున్నట్లు- సమాచారం. వసుధ ఫార్మా కెమ్‌ లిమి-టె-డ్‌ లో ఎంవీ రామరాజు ఛైర్మన్‌ గా ఉండగా, ఎంఎఎస్‌ రాజు, ఎం ఆనంద్‌, ఎంవీఎన్‌ మధుసూదన్‌ రాజు, ఎంవీఎస్‌ఎన్వీ ప్రసాద్‌ రాజు, ఎం.వరలక్ష్మి, కె.వెంకటరాజు, జి.వెంకటరమణ రాజు, డా.పీవీ అప్పాజీ, కొత్తపల్లి శ్రీహరి వర్మ సభ్యులుగా వున్నారు.

- Advertisement -

బడాబాబుల గుండెల్లో దడ
రాష్ట్రంలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల ఆర్థిక మూలాలను కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే ఐటీ, ఈడీ శాఖలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తునాయి. అదే సమయంలో రాష్ట్రంలో తరచూ ఐటీ దాడులు జరుగుతుండడాన్ని ఆయా రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన రాజపుష్ప కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాలన్నింటినీ వడపోసి ప్రతి డ్యాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగైదేళ్ళ కాలంగా ఈ సంస్థ స్థిరాస్తిరంగంలో దూసుకుపోతోంది. వేలాది ఎకరాల ల్యాడ్‌బ్యాంకును కలిగిఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement