Thursday, May 2, 2024

‘అగ్ని-5’ మిసైల్‌ విజయవంతం.. ప్రత్యేకత ఎంటో తెలుసా?

భారత రక్షణ రంగ వ్యవస్థ మరో సంచనలం నమోదైంది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ‘అగ్ని–5’ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దీనిని భారత రక్షణ రంగంలో మరో పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపింది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం.

కాగా, ఈ ఖండాంతర క్షిపణి అగ్ని–5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సిద్ధం చేసింది. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించగా.. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది.

ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. బాదుడే.. బాదుడు.. నేటి రేట్లు ఇవీ

Advertisement

తాజా వార్తలు

Advertisement