Sunday, April 28, 2024

Corona Update: దేశంలో 527 రోజుల కనిష్ఠానికి యాక్టివ్‌ కేసులు

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో  కొత్తగా10, 197 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 301 మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 12 ,134 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,28,555 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంత తక్కువ యాక్టివ్ కేసుల సంఖ్య నమోదు కావడం 527 రోజుల తర్వాత ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.82 శాతం ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,73,890కి చేరింది. ఇప్పటి వరకు 113.68 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 62 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement