Monday, April 29, 2024

Big Breaking | తెలంగాణ గురుకులాల్లో డైట్ చార్జీల పెంపు.. విద్యార్థుల్లో సంతోషం

గురుకులాల్లో చదివే విద్యార్థులకు సీఎం కేసీఆర్​ గుడ్​ న్యూస్​ చెప్పారు. తెలంగాణలోని అన్ని గురుకులాల్లో డైట్​ చార్జీలను పెంచుతూ ఇవ్వాల (శనివారం) కేబినెట్​ సబ్​ కమిటీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డైట్ చార్జీలన్నీ జులై నుంచి అమలు కానున్నాయి. పలు శాఖలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లలోనూ డైట్​ చార్జీలు పెరగనున్నాయి. 3 నుంచి 7 తరగతుల విద్యార్థులకు రూ.950 నుంచి 1200కు పెంచారు. 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు 1100 నుంచి 1400కు పెంచారు. ఇంటర్​, పీజీ స్టూడెంట్స్​కి 1500 నుంచి 1875కు పెంచారు. డైట్​ చార్జీలను పెంచిన విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన చిత్రపటానికి పలు జిల్లాల్లో పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement