Sunday, May 12, 2024

Breaking: తదుపరి సీజేఐగా జస్టిస్​ చంద్రచూడ్​.. తన వారసుడిగా సిఫార్సు చేయనున్న సీజేఐ లలిత్​

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా తన వారసుడి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన లేఖను ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్​ కేంద్రానికి ఇవ్వాల (మంగళవారం) అందజేయనున్నారు. ఈ మేరకు అన్ని అంశాలను పరిశీలించి.. తదుపరి సీజేఔగా జస్టిస్​ చంద్రచూడ్​ పేరును సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) UU లలిత్ తన వారసుడి కోసం”ఆచారబద్ధంగా” సిఫార్సు లేఖను అందజేయడానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తుల భేటీ నిర్వహించనున్నారు.

ఇక.. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును యూయూ లలిత్ కేంద్రానికి పంపనున్నారు. ప్రస్తుత CJI తన వారసుడిని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ అధికారిక లేఖను పంపాలని ప్రోటోకాల్ ఉంది. లేఖను తదుపరి CJIకి అందజేసి, న్యాయ మంత్రికి పంపిస్తారు.

ఈ లేఖ  అధికారికంగా అందజేయడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరితో ఇవ్వాల ఉదయం సమావేశం జరగనుంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారిగా ఈ వేడుకను ఫొటోగ్రాఫ్‌ని  ప్రజలకు విడుదల చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేఖ అందజేయడాన్ని మరింత బహిరంగ కార్యక్రమంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement