Friday, May 17, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.250 మేర తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం హైదరాబాద్‌లో రూ. 47 వేల 600కు చేరింది. అంతకుముందు రోజు ఇది రూ.47,850 వద్ద ఉంది. ఇదే 24 క్యారెట్ల పరంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,200 నుంచి రూ.51,930కు పడిపోయింది. అంటే తులం బంగారం రూ.270 మేర తగ్గిందన్నమాట. సిల్వర్ రేటు ఇంకా భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఒక్కరోజులోనే రూ.1200 తగ్గింది. అక్టోబర్ 10 ఉదయం కేజీ సిల్వర్ రూ.66 వేల వద్ద ఉండగా.. ప్రస్తుతం అది రూ.64,800కు చేరింది.ఆయా ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 250 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.47,750కి పడిపోయింది. 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.260 తగ్గి రూ.52,100కు పతనమైంది. దిల్లీలో సిల్వర్ రేటు కేజీకి రూ.1300 తగ్గింది. ప్రస్తుతం అక్కడ రూ.59,500 పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement