Thursday, April 25, 2024

హైద‌రాబాద్ సిటీకి ఆసియా వ్యాప్తంగా ఖ్యాతి.. టాప్ 20 స్థిరమైన సిటీస్‌లో భాగ్య‌న‌గ‌రానికి చోటు!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో ప్ర‌త్యేక ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో హైద‌రాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలోని దేశ నగరాల్లో మూడో స్థానంలో భాగ్య‌న‌గ‌రం ఉంది. బెంగళూరు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్​కు పేరు దక్కింది. ఆ తర్వాత ప్లేస్​లో ముంబై సిటీ ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్ల‌డించింది. ‘యాక్టివ్‌ క్యాపిటల్‌ ఏసియా పసిఫిక్‌- రైజింగ్‌ క్యాపిటల్‌ ఇన్‌ అన్‌సర్టెన్‌ టైమ్స్‌’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్ ఇచ్చింది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ వంటి నగరాలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో మొదటి ఐదు గ్రీన్-రేటెడ్ నగరాల జాబితాలో ఉన్నాయి. ఇక‌.. ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2021లోని మొదటి ఇరవై స్థిరమైన నగరాల్లో నాలుగు భారతీయ నగరాలున్నాయి. ఇందులో బెంగళూరు, ఢిల్లీ తర్వాత, స్థిరమైన వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది.

స్థిరమైన అభివృద్ధిని సృష్టించేందుకు రియల్ ఎస్టేట్ రంగం నిబద్ధతకు ఇది మంచి సూచన అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి వృద్ధిని కొత్త మార్కెట్ డైనమిక్స్ ప్రోత్సహించాయని చెప్పారు. ప్రపంచ నిబద్ధత పర్యావరణ అనుకూల ప్రమాణాలైన కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరోపైలపై ప్రధానంగా దృష్టి సారించాయని అన్నారు. భారతీయ డెవలపర్‌లు తమ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచుకోవడానికి ఇది తోడ్పడిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement