Friday, April 26, 2024

లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’.. ట్రైలర్​ రిలీజ్ చేసిన ​మూవీ టీమ్​

వరుస సినిమాలతో రెచ్చిపోయిన లావణ్య త్రిపాఠికి కాస్త బ్రేక్​ వచ్చింది. తాజాగా భిన్నమైన కథాశంతో రూపొందిన సినిమాలతో అభిమానులకు ముందుకు వస్తోంది. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు. ఇక.. ‘మత్తువదలరా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇంకా వెన్నెల కిశోర్ .. సత్య .. రాహుల్ రామకృష్ణ వంటి యాక్టర్లు కీలకమైన పాత్రలను పోషించారు.

కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి బుధవారం సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పూర్తి వినోదభరితమైన కథగా రూపొందిందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ‘ఆవేశం అగ్గిపుల్లలాంటిది ఒక్కసారే వెలిగించవచ్చు ..’ వంటి డైలాగ్స్ ట్రైలర్​లో బాగున్నాయి. నాన్ స్టాప్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీని జులై 8వ తేదీన విడుదల చేస్తున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement