Tuesday, May 7, 2024

Exclusive | శంషాబాద్​ ఎయిర్​పోర్టులో కిటకిట.. విదేశాలకు పోటెత్తిన స్టూడెంట్స్​!

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్​ నుంచి పెద్ద ఎత్తున స్టూడెంట్స్​ తరలివెళ్తున్నారు. నెల, రెండు నెలలుగా వీసా, ఇతర కార్యక్రమాలను కంప్లీట్​ చేసుకుని ఈ నెలలో ప్రయాణాలు పెట్టుకున్నారు. అటు రెగ్యులర్​ ప్రయాణికులు, ఇటు స్టూడెంట్స్​ తాకిడికి ఒక్కసారిగా పెరిగిన రద్దీతో శంషాబాద్​ ఎయిర్​పోర్టు కిటకిటలాడుతోంది. దీంతో ఎయిర్​పోర్టు పరిసరాలు, ర్యాంపు, యాక్సెస్​ రోడ్లన్నీ వాహనాలు, సందర్శకులతో నిండిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఒక్కో స్టూడెంట్​ని పరామర్శించేందుకు మీటర్లు, గ్రీటర్లు దాదాపు 50 నుంచి 60 మంది దాకా వస్తున్నారు. ఇట్లా కార్ల సంఖ్య కూడా పెరిగి ట్రాఫిక్​ నిలిచిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది రావొద్దని ఎయిర్​పోర్టు అధికారులు రిక్వెస్ట్​ చేస్తున్నారు.

‌‌- వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్‌ విమానాశ్రయంలో రద్దీ కొనసాగుతోంది. విమానాశ్రయం వారు ఓ రిక్వెస్ట్​ చేసినప్పటికీ, స్టూడెంట్స్​ ఒక్కసారిగా రావడంతో ఆ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల రద్దీతోపాటు ఇతర ప్రయాణికుల రద్దీ కారణంగా విమానాశ్రయంలో మీటర్లు, గ్రీటర్‌ల కారణంగా జనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎయిర్​పోర్టు వర్గాలు చెబుతున్నాయి.  ఒక్కో ప్రయాణికుడికి 50 నుండి 60 మంది సందర్శకులు..పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయని అంటుననారు. దీంతో ఎయిర్​పోర్టు పరిసరాలు, యాక్సెస్ రోడ్డు,ర్యాంపులలో ట్రాఫిక్​ నిలిచిపోతోంది.

ఇట్లాంటి పరిస్థితులు ఇతర ప్రయాణికులకు అసౌకర్యంగా మారాయని,  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాన్ని కూడా హై సెక్యూరిటీ అలర్ట్‌లో ఉంచినందున మీటర్లు, గ్రీటర్‌లు .. వాహనాల సంఖ్య తగ్గించుకోవాలని ఎయిర్​పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణికులు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రయాణికుల సహకారాన్ని కోరుతూ హైదరాబాద్ విమానాశ్రయం అభ్యర్థించింది.

- Advertisement -

 విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతోనే..

యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాతో సహా చాలా ఇతర దేశాలకు వెళ్లేందుకు స్టూడెంట్స్​ పోటెత్తారు. వాస్తవంగా ఇలాంటి పరిస్థితి  సెప్టెంబర్‌లో ఉంటుంది, కానీ, వీసాల మంజూరుతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు పయనమవుతున్నారు. సెప్టెంబర్‌లో ప్రవేశాలు,  వీసాలు పొందిన వారు సాధారణంగా జులై లేదా ఆగస్టులో ప్రయాణిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో హైదరాబాద్ విమానాశ్రయం యాక్సెస్ రోడ్డు,  ర్యాంపులలో రద్దీ కారణంగా ఇబ్బందులను ఎదురవుతున్నాయి.

హైదరాబాద్‌కు త్వరలో రెండో విమానాశ్రయం వచ్చే చాన్స్​..

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నగరంలో రెండో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడంతో హైదరాబాద్‌ త్వరలో రెండు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితాలో చేరే అవకాశం ఉంది. హకీంపేట్‌లోని డిఫెన్స్‌ ఎయిర్‌పోర్టును పౌర విమానయానానికి అనుమతించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని త్వరలో రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది. నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో, రెండవ విమానాశ్రయం అవసరమని తెలంగాణ మంత్రివర్గం భావించింది. ఈ మేరకు వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement