Sunday, May 5, 2024

అమ్మమ్మ చేతివంట ఇష్టం .. హైద‌రాబాద్ బిర్యానీ కూడా .. మ‌హేశ్ బాబు ..

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకి గెస్ట్ గా వ‌చ్చారు. కాగా మ‌హేశ్ బాబు గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటా అని అంద‌రూ అడుగుతుంటారు. అయితే ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంలో త‌న‌కి ఫేవ‌రెట్ ఫుడ్ ఏంటో చెప్పారు మ‌హేశ్ బాబు. తనకు హోమ్ ఫుడ్ అంటేనే చాలా ఇష్టమని తెలిపారు. అది కూడా అమ్మమ్మ చేసిన వంట అంటే అన్నిటికంటే ఇష్టమన్నారు. హైదరాబాద్ బిర్యానీ తన ఫేవరెట్ అని చెప్పారు. క్రీడల విషయానికి వస్తే బాస్కెట్ బాల్ చూడటం ఇష్టమని తెలిపారు.

ఇటీవల తాను ఫుట్ బాల్ లీగ్ కూడా చూశానని తెలిపారు. ఇంటర్ వరకు తాను క్రికెట్ ఆడేవాడినన్నారు. దీంతో ఎన్టీఆర్ మనం కలిసి క్రికెట్ ఆడదామని అడగ్గా… దానికి మహేశ్ అంగీకరించారు. నాలుగేళ్ల వయసులో తాను నటించడం ప్రారంభించానని తెలిపారు. ‘మా ఊళ్లో ఒక పడుచుంది’ అనే పాట అంటే తనకు ఇష్టమని… తాను నటించిన చిత్రాల్లో ‘ఒక్కడు’ తన ఫేవరెట్ మూవీ అని ప‌లు విష‌యాల‌ను ఈ షో లో షేర్ చేసుకున్నారు మ‌హేశ్ బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement